పది రోజులు దాటుతున్నా పవన్ బయటకు రాలేదేం?

Update: 2021-04-28 06:19 GMT
కరోనాకు వాళ్లు వీళ్లు అన్న తేడా లేదు. దానికి దొరకాలే కానీ సామాన్యుడైనా.. అసమాన్యుడైనా ఒక్కటే. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులకు ఏమాత్రం తీసిపోని రీతిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు.. సిసీ.. రాజకీయ రంగాలకు చెందిన వారు కరోనా బారిన పడటం తెలిసిందే ఎవరి వరకో ఎందుకు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ తో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్.. కేసీఆర్ ఫ్యామిలీకి చెందిన ఎమ్మెల్సీ కవిత .. ఇలా ఫ్యామిలీ మొత్తం మహమ్మారి బారిన పడటం తెలిసిందే.

రిల్ మీద పవర్ స్టార్ గా పేరున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ పది రోజుల క్రితం కరోనా బారిన పడటం తెలిసిందే. ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురి చేసిన ఈ వార్తకు రిలీఫ్ గా ఆయనకు నెగిటివ్ వచ్చిందన్న ప్రకటన చేశారు. ఆ మాట చెప్పి దాదాపు ఐదు రోజులు దాటుతోంది. కానీ.. పవన్ కల్యాణ్ మాత్రం ఫాంహౌస్ వదిలి రాని పరిస్థితి. ఎందుకిలా? అన్నది ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నెగిటివ్ వచ్చినప్పటికి ఊపిరితిత్తుల్లో  కొంత ఇన్ఫెక్షన్ ఉందని.. దాన్ని క్లియర్ చేసుకోవాలన్న ఉద్దేశంతోనే శంకర్ పల్లిలోని ఫాంహౌస్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. కరోనా అనంతరం ఉండే బలహీనంగా ఉండటం.. ఒంటి నొప్పులు కూడా మరిన్ని రోజులు ఫాంహౌస్ లో ఉండిపోవటానికి కారణంగా చెబుతున్నారు.

బయట కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావటం.. మే నెలాఖరు వరకు కేసుల తీవ్రత ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతున్న వేళ.. తన రోజువారీ కార్యకలాపాలకు చెక్ పెట్టాలన్న ఆలోచనతోనే ఫాంహౌస్ కు పరిమితమైనట్లుగా తెలుస్తోంది. బయటకు వచ్చి.. ఏ చిన్న కార్యక్రమాన్ని చేపట్టినా పెద్ద ఎత్తున హాజరు ఉండటంతో.. అందరికి దూరంగా ఉండాలన్న ఆలోచనతోనే ఫాంహౌస్ ను విడిచి రావటం లేదంటున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పటికీ.. చిన్న చిన్న అంశాలు మరింత క్లియర్ కావాల్సి ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News