లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత ఓటీటీకి ఎందుకు?

Update: 2021-07-02 00:30 GMT
గత ఏడాది దాదాపుగా పది నెలలు థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఆ తర్వాత ఓపెన్‌ చేస్తే పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టారు. కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ముందు జనాలు క్యూ కడతారనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లు అతి త్వరలోనే పునః ప్రారంభం కాబోతున్న సమయంలో పలు సినిమా లు ఓటీటీ బాట పట్టడం చర్చనీయాంశంగా మారింది. సినిమా ప్రేమికులు ఓటీటీ కంటే థియేటర్లలో సినిమా ను విడుదల చేయాలని కోరుతున్నారు. కాని కొందరు మేకర్స్ మాత్రం ఓటీటీ బాట పడుతున్నారు.

ఇప్పటికే వెంకటేష్ నటించిన దృశ్యం 2 మరియు నారప్ప సినిమా లు ఓటీటీ లో విడుదల కాబోతున్నాయి. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అతి త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌ లు వస్తాయని అంటున్నారు. వెంకీ మామ సినిమాల విషయంలో సురేష్‌ బాబు తీసుకున్న నిర్ణయం పట్ల ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అభిమానులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన గల్లీ రౌడీ సినిమా కూడా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ ఈ సినిమా కు నిర్మాతలు ఆశించినంత భారీ ప్రైజ్ ను ఇచ్చారట. దాంతో ఒప్పందం కుదిరింది అంటున్నారు. ఓటీటీ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్ చేయడం ఖాయం అంటూ సందీప్‌ కిషన్‌ సన్నిహితుల ద్వారా కూడా సమాచారం అందుతోంది. ఈ సినిమా మంచి కంటెంట్ తో రూపొందిందని.. ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉండటం వల్ల తప్పకుండా ఈ సినిమా ఆకట్టుకుంటుందనే నమ్మకంతో సదరు ఓటీటీ వారు ఈ సినిమాను కొనుగోలు చేశారనే టాక్‌ వినిపిస్తుంది. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇలా వరుసగా సినిమా లు ఓటీటీ వైపు వెళ్లడం విచారకరం అంటూ సినీ ప్రముఖులు గల్లీ రౌడీ విషయమై కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు.
Tags:    

Similar News