విశ్వంభర.. నెక్స్ట్ ప్లాన్ కి సిద్ధమయ్యారా?

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన వింటేజ్ పవర్‌ను మళ్ళీ చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి సీజన్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.;

Update: 2026-01-18 05:59 GMT

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన వింటేజ్ పవర్‌ను మళ్ళీ చూపిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి సీజన్‌లో వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ప్రస్తుతం 300 కోట్ల క్లబ్ దిశగా పరుగులు తీస్తోంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఉన్న ఈ పాజిటివ్ వైబ్‌ను చిరు తర్వాతి చిత్రం 'విశ్వంభర' కోసం వాడుకోవాల్సిన టైమ్ వచ్చింది.

ఒకప్పుడు 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి సోషియో ఫాంటసీలతో మ్యాజిక్ చేసిన చిరంజీవి, మళ్ళీ అదే జోనర్‌లో వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్నారు. 'MSG' ఇచ్చిన కిక్‌తో ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే, 'విశ్వంభర' టీమ్ ముందు ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ ఉంది. గతంలో రిలీజైన టీజర్‌పై విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో డివైడ్ రియాక్షన్స్ వచ్చాయి. అందుకే క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకూడదని మేకర్స్ సినిమాను 2026 వేసవికి వాయిదా వేశారు.

ఇప్పుడు 'MSG' హిట్ అయిన జోష్ లో ఉన్న ఆడియన్స్‌ను మెప్పించాలంటే, సరికొత్త విజువల్ గ్లింప్స్‌తో టీమ్ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలి. సోషియో ఫాంటసీ సినిమాలకు విజువల్స్ ప్రాణం. అందుకే వీఎఫ్‌ఎక్స్ పనుల కోసం ఏడాది పాటు టైమ్ తీసుకుంటున్నట్లు చిరంజీవి స్వయంగా వెల్లడించారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా అద్భుతమైన ప్రొమోషనల్ కంటెంట్ రిలీజ్ చేస్తే, 'విశ్వంభర' రిలీజ్ టైమ్‌కు క్రేజ్ మామూలుగా ఉండదు.

ముఖ్యంగా పిల్లలను, పెద్దలను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రస్తుతం చిరంజీవి దృష్టంతా 'విశ్వంభర' పనుల మీదే ఉందని టాక్. 70% కంటే ఎక్కువ వీఎఫ్‌ఎక్స్‌తో రూపొందుతున్న ఈ సినిమా, హై రేంజ్ విజువల్స్ ఇస్తే బాక్సాఫీస్ వద్ద మరో మెగా రికార్డ్ ఖాయం. అయితే సినిమా ఏమోషన్ స్క్రీన్ ప్లేలో కూడా కంటెంట్ ఉంటేనే ఈ మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది.

షూటింగ్ ఇప్పటికే పూర్తయినందున, వీలైనంత త్వరగా టీమ్ నుంచి సర్ ప్రైజింగ్ అప్‌డేట్స్ రావాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇక ఆ రూట్లో వెళతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమాలో మెగాస్టార్ కు జోడిగా త్రిష నటిస్తున్న విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News