MSG 6 రోజుల లెక్క.. బ్రేక్ ఈవెన్ కూడా పూర్తయినట్లే..

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ఈ సంక్రాంతికి ఒక క్లారిటీ వచ్చేసింది.;

Update: 2026-01-18 06:47 GMT

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి ఈ సంక్రాంతికి ఒక క్లారిటీ వచ్చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) సినిమా థియేటర్ల వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా సాధించిన ఘనత చూస్తుంటే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవుతోంది. సినిమా రిలీజ్ అయినప్పటి నుండి రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి తప్ప ఎక్కడా తగ్గే సూచనలు కనిపించడం లేదు.




లేటెస్ట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన అఫీషియల్ పోస్టర్ల ప్రకారం, ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల గ్రాస్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మెగాస్టార్ మ్యాజిక్ ఇంకా తగ్గలేదని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యం అని చెప్పవచ్చు. సంక్రాంతి సెలవులను పర్ఫెక్ట్‌గా వాడుకున్న ఈ చిత్రం, బయ్యర్లకు పండగ ముగియకముందే అసలైన పండగను తీసుకొచ్చింది.

ఈ సినిమా సాధించిన మరో భారీ రికార్డ్ ఏంటంటే, కేవలం ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం. సాధారణంగా భారీ బడ్జెట్ సినిమాలు సేఫ్ జోన్‌లోకి రావడానికి కనీసం రెండు వారాల సమయం పడుతుంది, కానీ మన శంకర వరప్రసాద్ గారు మాత్రం రికార్డ్ టైమ్‌లో క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. దీనివల్ల బయ్యర్లు ఇప్పుడు భారీ లాభాల దిశగా అడుగులు వేస్తున్నారు.

ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద కూడా చిరంజీవి తన సత్తాను నిరూపించుకున్నారు. నార్త్ అమెరికాలో సైరా నరసింహారెడ్డి రికార్డులను అధిగమించి, మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా MSG నిలిచింది. త్వరలోనే అక్కడ 3 మిలియన్ డాలర్ల మార్క్ ని చేరుకోబోతోందని ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. అలాగే బుక్ మై షో వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా భారీ బుకింగ్స్‌తో పాత రికార్డులను బద్దలు కొడుతోంది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ సినిమా 300 కోట్ల క్లబ్‌లో చేరడానికి పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. ఆరు రోజుల్లోనే 261 కోట్లు దాటేయడంతో, ఫుల్ రన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ట్రాక్ లో దూసుకుపోతోందని మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక రీజినల్ కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం టాలీవుడ్‌లో ఒక రేర్ ఫీట్‌గా మిగిలిపోతుంది.

ఇక ఆదివారం రోజు కూడా సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సాలీడ్ గానే ఉన్నాయి. గత ఏడాది పవన్ కళ్యాణ్ OG తో భారీ కలెక్షన్స్ అందుకోగా ఇప్పుడు 2026లో మెగాస్టార్ మళ్ళీ స్ట్రాంగ్ గా టాలీవుడ్ కి మంచి ఓపెనింగ్స్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ పెద్దితో చిరు తనయుడు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News