CCLలో అయ్యగారి సెంచరీ.. కానీ బజ్ లేదేంటి?

అయ్యగారు అదేనండీ.. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లెనిన్ తో బిజీగా ఉన్నారు.;

Update: 2026-01-18 08:14 GMT

అయ్యగారు అదేనండీ.. టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లెనిన్ తో బిజీగా ఉన్నారు. కెరీర్ లో గట్టి హిట్ అందుకోవాలనే పట్టుదలతో చేస్తున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ద్వారా అఖిల్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి.

ఇక లెనిన్ మూవీతో బిజీగా ఉన్న అఖిల్.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2026లో దుమ్మురేపుతున్నారు. తెలుగు వారియర్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఆయన.. రీసెంట్ గా జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించారు. వైజాగ్ వేదికగా పంజాబ్ దే షేర్‌ టీమ్ తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశారు అఖిల్. 6 సిక్సర్లు, 7 ఫోర్లతో 180కి పైగా స్ట్రైక్ రేటుతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

అఖిల్‌ కు తోడు తెలుగు బ్యాటర్ అశ్విన్ బాబు 60 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన తెలుగు వారియర్స్ జట్టు 184 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ తర్వాత పంజాబ్ ది షేర్ జట్టు 132 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 52 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. అందులో అఖిల్ ముఖ్య పాత్ర పోషించారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే అఖిల్ సెంచరీ చేసిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. దీంతో అఖిల్ లో మంచి బ్యాటింగ్ టాలెంట్ ఉంది కదా అంటూ గుర్తు చేసుకుంటున్నారు. అంతే కాదు.. క్రికెటర్‌ గా ప్రయత్నించి ఉంటే.. కెరీర్‌ లో కచ్చితంగా సక్సెస్ అయ్యేవారంటూ కామెంట్లు చేస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు మరో విషయం కూడా నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. నిజానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పై ఒకప్పుడు పుల్ క్రేజ్ ఉండేది. సిల్వర్ స్క్రీన్ పై సందడి చేసే సెలబ్రిటీలు క్రికెట్ ఆడుతుండడాన్ని చూసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. అంతా ఎంజాయ్ చేసేవారు. స్టేడియాలు అన్నీ ఫుల్ అయిపోయేవి. క్రికెట్ కమ్ సినీ అభిమానులతో ఓ రేంజ్ లో కళకళలాడిపోయేవి.

కానీ ఇప్పుడు సీసీఎల్ వంటి లీగ్స్ కు అప్పుడు ఉన్నంత క్రేజ్ కనిపించడం లేదు. స్టేడియాలకు ఆడియన్స్ వస్తున్నా కూడా.. ఒకప్పుడు వచ్చేంత ప్రజలు అయితే కనపడడం లేదు. అదే సమయంలో అఖిల్ సెంచరీ చేసిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా.. అప్పుడు క్రియేట్ అయ్యే బజ్ ఇప్పుడు లేదని చెప్పాలి. మొత్తానికి అయ్యగారు మాత్రం శతకంతో అదరగొట్టేశారు.

Tags:    

Similar News