బ్లాక్ అవుట్ ఫిట్ లో నేహా అందాలు అదరహో..
ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.;
ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పైగా సినిమాలలో అవకాశాలు ఉన్నా.. లేకపోయినా.. సోషల్ మీడియాను మాత్రం అస్సలు వదలడం లేదు అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఆడియన్స్ కు సెలబ్రిటీలను దగ్గర చేయడమే కాకుండా వారికి సినిమాలలో కూడా అవకాశాలు కల్పిస్తుందనే ఆశ ఇప్పుడు అందరిలో మొదలైంది. అందులో భాగంగానే తమ ఉనికిని చాటుకోవడానికి సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నారు సెలబ్రిటీలు.
పైగా ఇప్పుడు సమయం సందర్భంతో పనిలేకుండా తమకు నచ్చినప్పుడు నచ్చిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సండే స్పెషల్ అంటూ ప్రముఖ బ్యూటీ నేహా శర్మ తన అందాలు ఆరబోస్తూ బ్లాక్ డ్రెస్ లో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రకరకాల ఫోజులతో కుర్రకారులో హీట్ పుట్టించిందని చెప్పవచ్చు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అమ్మడి అందానికి అభిమానులు కూడా ఫిదా అవుతున్నారు. మొత్తానికి నేహా శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
1987 నవంబర్ 21న బీహార్ లోని భాగల్పూర్ లో జన్మించింది. ఈమె తండ్రి అజిత్ శర్మ వ్యాపారవేత్త.m పైగా రాజకీయ నాయకుడు కూడా.m ఈయన భాగల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. నేహా శర్మ న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్స్ పూర్తి చేసింది. చిన్నప్పుడే ఆస్తమా వ్యాధితో బాధపడిన ఈమె.. హైదరాబాదుకు చెందిన ఒక కుటుంబం సహాయంతో వ్యాధిని నయం చేయించుకున్నట్లు సమాచారం.
అయితే సినిమాల్లోకి రావాలనుకున్న నేహా శెట్టి అందులో భాగంగానే మోడల్ గా తన కెరీర్ను ఆరంభించి, 2007లో తొలిసారి మెగాస్టార్ చిరంజీవి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తొలి పరిచయంలో వచ్చిన 'చిరుత' సినిమాతోనే ఈమె కూడా తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తర్వాత 'కుర్రాడు' అనే మరో తెలుగు చిత్రంలో నటించిన నేహా శర్మ దాని తర్వాత మళ్ళీ తెలుగులో సినిమాలు చేయలేదు. హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె.. చివరిగా దేదే ప్యార్ దే 2 సినిమాలో నటించింది. ప్రస్తుతం జాస్సీ గిల్ తో సంజోగ్ అనే పంజాబీ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే సోనీ లైవ్లో ఒక వెబ్ సిరీస్ చేస్తోంది. దీనితో పాటు మరి రెండు ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లు అంటూ బిజీగా గడిపేస్తున్న నేహా శర్మ.. ఇలా గ్లామర్ తో కూడా ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.