టాలీవుడ్ నెక్స్ట్ పెళ్లి కొడుకు ఈ హీరోనేనా?

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి.;

Update: 2026-03-06 06:56 GMT

టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారాయి. ఇండస్ట్రీలో వరుస పెళ్లిళ్లు జరుగుతుండగా.. ఇప్పుడు ఆయన కూడా బ్యాచిలర్ లైఫ్ కు గుడ్‌ బై చెప్పేందుకు సిద్ధమయ్యారని, కుటుంబసభ్యులు ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు ప్రారంభించినట్టుగా ప్రచారం జరుగుతోంది. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారని తెలుస్తోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డి అనే యువతిని వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే ఆ సంబంధం లవ్ మ్యారేజా? లేక పెద్దలు కుదిర్చినదా? అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. కానీ అది పెద్దలు కుదిర్చిన వివాహమే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.

అదే సమయంలో ఈ వారంలోనే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగే అవకాశముందని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కావ్య రెడ్డి గురించి వైరలవుతున్న సమాచారం ప్రకారం, ఆమె సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని తెలుస్తోంది. ఆమె కుటుంబం న్యాయవాద రంగానికి చెందినదని టాక్ వినిపిస్తోంది. కావ్య రెడ్డి తాత ఒకప్పుడు జడ్జిగా పనిచేశారని, ఆమె తండ్రి ప్రముఖ లాయర్‌ గా ఉన్నారని సమాచారం.

అంతేకాకుండా ఆ రెండు కుటుంబాల మధ్య చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ పరిచయాల నేపథ్యంలోనే సంబంధాన్ని పెద్దలు ఖరారు చేసినట్టు టాక్ వినిపిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ.. 2024 చివర్లో తన కుమారుడి పెళ్లి గురించి మాట్లాడారు. 2025లోనే పెళ్లి ఉంటుందని అప్పుడు చెప్పారు.

కానీ ఏం జరిగిందో తెలియదు.. ఇప్పుడు 2026లో వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నిశ్చితార్థం అనంతరం పెళ్లి తేదీ, వెన్యూ, వధువు వివరాలపై బెల్లంకొండ కుటుంబం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. ఇక సాయి శ్రీనివాస్ సినీ జర్నీ విషయానికి వస్తే, 2014లో విడుదలైన అల్లుడు శీను చిత్రంతో హీరోగా టాలీవుడ్‌ కు పరిచయమయ్యారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుసగా కమర్షియల్, యాక్షన్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ ను సంపాదించుకున్నారు.

జయ జానకీ నాయక, రాక్షసుడు వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. యాక్షన్ పాత్రల్లో ఆయన చూపించే ఎనర్జీకి అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. శ్రీనివాస్ సినిమాలు హిందీలో డబ్ అవడంతో నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇటీవల విడుదలైన కిష్కింధపురి సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించగా, ప్రస్తుతం టైసన్ నాయుడు వంటి పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి విషయంపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News