నందిని ఫోన్లో సమంత పేరేంటో తెలుసా?
ఆమె యుఎస్ షోల నుంచి వచ్చే టాక్, రివ్యూలను తెలుసుకుంటుందని.. దీంతో ఆ రోజు రాత్రంగా నిద్రపోదని.. తాను టెన్షన్ పడడంతో పాటు పక్కవాళ్లనూ టెన్షన్ పెడుతుందని నందని చెప్పుకొచ్చింది.
తెలుగులో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టడం అరుదు. సమంత, నందిని రెడ్డి జోడీ రెండుసార్లు ఈ ఘనత సాధించింది. ఇంతకుముందు ‘ఓ బేబీ’తో ఘనవిజయాన్నందుకున్న ఈ ద్వయం.. ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’తో ఇంకా పెద్ద విజయాన్ని అందుకుంది. ఐతే సమంత ఇంతకుముందు కూడా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో హిట్లు కొట్టింది కానీ.. ‘మా ఇంటి బంగారం’ లెవెల్ వేరు. ఇందులో ఆమె కేవలం కామెడీ, ఎమోషన్లతో మాత్రమే కాకుండా.. యాక్షన్ సన్నివేశాలతోనూ అదరగొట్టింది.
ఈ సినిమాలో ఆ సీక్వెన్సులు హైలైట్‌గా నిలిచాయి. కెరీర్లో చాలా వరకు సాఫ్ట్ గర్ల్ రోల్స్ చేసిన సమంతతో ఇప్పుడు ఇలాంటి విన్యాసాలు చేయించడం విశేషమే. ఐతే సమంత పెద్ద స్టార్ అని నమ్మే తాను అలాంటి సీన్లు చేయించానని నందిని రెడ్డి చెప్పింది. ఆ ఉద్దేశంతోనే తాను సమంత పేరును తాను ‘సామ్ క్రూయిజ్’ అని తన ఫోన్లో సేవ్ చేసుకున్నట్లు ఆమె వెల్లడించింది.
హాలీవుడ్లో యాక్షన్ ఘట్టాలకు టామ్ క్రూయిజ్ పెట్టింది పేరు కాబట్టి.. ఆయన లాగే సమంత కూడా ఇక్కడ పెద్ద స్టార్, తను కూడా ఆయన లాగా యాక్షన్ సీక్వెన్సులను అద్భుతంగా పండించగలదు అని తాను నమ్మాలనే ఉద్దేశంతోనే తన ఫోన్లో సమంత పేరును ‘సామ్ క్రూయిజ్’ అని పెట్టుకున్నట్లు నందిని వెల్లడించింది. ‘మా ఇంటి బంగారం’ సినిమా తీస్తున్నపుడు ప్రేక్షకులు ఎక్కడ విజిల్స్ వేస్తారు.. ఏ సీన్ పండుతుంది అన్నది ప్రేక్షకుల కోణంలో ఆలోచిస్తూ.. సన్నివేశాలు తెరకెక్కించినట్లు ఆమె వెల్లడించింది.
ఇక సినిమా రిలీజ్ టైంలో సమంత ఎంత టెన్షన్ పడుతుందో నందిని చెప్పుకొచ్చింది. ఆమె యుఎస్ షోల నుంచి వచ్చే టాక్, రివ్యూలను తెలుసుకుంటుందని.. దీంతో ఆ రోజు రాత్రంగా నిద్రపోదని.. తాను టెన్షన్ పడడంతో పాటు పక్కవాళ్లనూ టెన్షన్ పెడుతుందని నందని చెప్పుకొచ్చింది. ‘ఓ బేబీ’ టైంలో తనను ఇలాగే టార్చర్ పెట్టడంతో ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ టైంలో తాను ఫోన్ స్విచాఫ్ చేసి పడుకున్నానని, కానీ రాజ్ నిడిమోరు మాత్రం బుక్ అయిపోయాడని నందిని వెల్లడించింది. ఐతే ఈ విషయంలో రాజ్‌ను ముందే హెచ్చరించగా.. సమంత ఇప్పుడలా ఏమీ లేదని, మారిపోయిందని చెప్పాడని.. కానీ ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు తనకు సామ్ చుక్కలు చూపించినట్లు రాజ్ తర్వాత వెల్లడించాడని నందిని చెప్పింది.