శర్వానంద్ బర్తడే స్పెషల్: సినిమాల నుంచి బిజినెస్ వెంచర్స్ వరకు.. ఆస్తి ఎన్ని కోట్లంటే?
చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అతి కొద్ది మంది హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు.;
చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన అతి కొద్ది మంది హీరోలలో శర్వానంద్ కూడా ఒకరు. కెరియర్ మొదటి నుంచే డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు.. ముఖ్యంగా ఎక్స్పరిమెంటల్ తో లవ్ స్టోరీలో , ఫ్యామిలీ డ్రామాలు చేస్తూ ఫ్యాన్ బేస్ పెంచుకున్న లాంగ్ గ్యాప్ తర్వాత బైకర్, భోగి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు కావడంతో అటు సినిమాల నుంచి ఇటు వ్యాపార వెంచర్స్ వరకు మొత్తం ఎంత ఆస్తి పోగు చేశారు? అనే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
1984 మార్చి 6వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడలో జన్మించిన ఈయన హైదరాబాదులో పెరిగారు. బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈయన.. అదే స్కూల్లో చదువుకున్న రామ్ చరణ్, రానా దగ్గుబాటిలతో మంచి స్నేహ బంధం ఏర్పడింది. అలా ముగ్గురు కలిసి ఒకే చోట చదువుకున్నారు. ఇక రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ గా ఇండస్ట్రీలో చలామణి అవుతూ తనకంటూ మరింత ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శర్వానంద్.. ఒక్కో సినిమాకు దాదాపుగా 3 నుంచి 4 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. అటు సినిమాలతో పాటు ఇటు బ్రాండ్ ఎండార్స్మెంట్ , బిజినెస్ లు కూడా చేస్తున్నారు. వీటి ద్వారా దాదాపుగా సంవత్సరానికి కోటి 20 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలుస్తోంది. అలాగే యాన్యువల్ ఇన్కమ్ చూసుకుంటే రెండు కోట్ల పై మాటే అని సమాచారం.
ఇకపోతే శర్వానంద్ హీరో గానే కాకుండా ఆ మధ్యకాలంలో నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలకు వ్యవహరించారు. దీనికి తోడు "ఓంఐ" పేరుతో కొత్త బ్రాండ్ ని కూడా ప్రారంభించారు. మూవీ ప్రొడక్షన్ తో పాటు వెల్నెస్, హాస్పిటల్ లో కూడా ఈ బ్రాండ్ పై ప్రొడక్టులు రాబోతున్నాయి. ఇక ఈ బ్రాండ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం శర్వానంద్ నెట్వర్క్ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక ఈయన ఆస్తుల వివరాల విషయానికొస్తే.. హైదరాబాద్ ఫిలింనగర్ లో ఒక లగ్జరీ ఇల్లు ఉంది. దీని విలువ సుమారుగా 16 కోట్లు. అలాగే ఈయన ఫ్యామిలీ అకౌంటింగ్ ఫీల్డ్ లో ఉండడంతో అటు రియల్ ఎస్టేట్ , ఫైనాన్సియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో భారీగానే ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి.
శర్వానంద్ కి కారు కలెక్షన్స్ మంచి పట్టు ఉంది. తన కార్ కలెక్షన్స్ లో ప్రీమియం వెహికల్స్ ఉన్నాయి. దాదాపుగా రెండు కోట్ల విలువైన ఆడి Q5, రేంజ్ రోవర్, మిత్సుబిషి పజెరో వంటి కార్లు వాడుతున్నారు.
శర్వానంద్ సినిమా కెరియర్ విషయానికొస్తే.. 2005లో వెన్నెల సినిమాతో తన కెరీర్ ను ప్రారంభించిన ఈయన అమ్మ చెప్పింది సినిమాలో తన నేచురల్ యాక్టింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. గమ్యం, అందరి బంధువయ, రన్ రాజా రన్ వంటి కామెడీ, కమర్షియల్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ఏంటో చూపించారు. ఇక శతమానం భవతి, మహానుభావుడు, జాను, మహాసముద్రం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి చిత్రాలతో ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకున్నారు శర్వానంద్. ఇక ప్రస్తుతం బైకర్, భోగి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.