టాక్ పరంగా ఫస్ట్...కానీ సరిపడా థియేటర్స్ లేవు..ఎక్కడ తేడా కొట్టింది?
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండటంతో చాలా రోజుల తరువాత థియేటర్స్ నిండుగా కనిపించాయి.;
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఐదు సినిమాల మధ్య గట్టి పోటీ ఉండటంతో చాలా రోజుల తరువాత థియేటర్స్ నిండుగా కనిపించాయి. ఇక ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాకు సపోర్ట్ చేయడంలో ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవ్వరని నిరూపించారు. ఎవరికి నచ్చిన సినిమాలకు వారు వెళుతున్నారు. అయితే, సోషల్ మీడియా, మూవీ లవర్స్ టాక్ ప్రకారం, అన్నిటికంటే బెస్ట్ రివ్యూలు తెచ్చుకున్న సినిమా 'నారీ నారీ నడుమ మురారి'. శర్వానంద్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోసారి సంక్రాంతి హ్యాట్రిక్ హిట్ కొట్టేశారు అనేలా వైబ్స్ కనిపించాయి. కానీ, గ్రౌండ్ లెవల్ రియాలిటీ చూస్తుంటే మాత్రం పరిస్థితి వేరేగా ఉంది.
సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ, థియేటర్ల వద్ద ఆ సందడి కనిపించడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. ముఖ్యంగా రాజమండ్రి లాంటి పెద్ద సిటీలలో కూడా ఈ సినిమాకు సరైన స్క్రీన్స్ దొరకలేదని తెలుస్తోంది. 'అనగనగా ఒక రాజు' వంటి సినిమాలు పది థియేటర్లలో రన్ అవుతుంటే, టాక్ బాగున్న 'నారీ నారీ నడుమ మురారి' కనీసం ఐదు థియేటర్లలో కూడా కనిపించడం లేదట. బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్నా, షోలు లేక ప్రేక్షకులు వెనక్కి తిరుగుతున్నారని తెలుస్తోంది.
ఈ గ్యాప్‌కు మెయిన్ రీజన్ థియేటర్ షేరింగ్, ప్రమోషన్స్ అని మరికొందరు అంటున్నారు. నవీన్ పోలిశెట్టి తన సినిమా కోసం చాలా అగ్రెసివ్ గా ప్రమోషన్స్ చేశారు, దానికి తోడు సితార ఎంటర్టైన్మెంట్స్ సపోర్ట్ ఉండటంతో థియేటర్ల కౌంట్ పెరిగింది. కానీ శర్వానంద్ సినిమా విషయానికి వస్తే, స్టార్టింగ్ లో ప్రమోషన్స్ అంత యాక్టివ్ గా లేవు. సంక్రాంతి రేసులో చివరిగా ఎనౌన్స్మెంట్ వచ్చింది, చివరిగా విడుదలైన సినిమా కావడంతో మిగిలిన సినిమాలకే ఎక్కువ స్క్రీన్స్ వెళ్లాయనే టాక్ ఉంది.
టాక్ పరంగా నారీ నారీ నడుమ మురారి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా, వసూళ్ల పరంగా మాత్రం మూడో లేదా నాలుగో స్థానానికి పడిపోయింది. ఒకవేళ ఈ సినిమాకు 'అనగనగా ఒక రాజు'కు దక్కినన్ని షోలు దక్కి ఉంటే, కలెక్షన్స్ రేంజ్ మరోలా ఉండేదని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. సూపర్ హిట్ కంటెంట్ ఉన్నా, సరైన షోలు లేక ఈ సినిమా బాక్సాఫీస్ పొటెన్షియల్‌ను పూర్తిగా ఉపయోగించుకోలేకపోతోంది.
నిజానికి శర్వానంద్ గతంలో సంక్రాంతికి 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'శతమానం భవతి' సినిమాలతో క్లీన్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు కూడా అదే లెవల్ మౌత్ టాక్ ఉంది. ఒకవేళ ఈ సినిమా సంక్రాంతి కాకుండా వేరే సోలో డేట్ లో వచ్చి ఉంటే, 100 కోట్ల క్లబ్ లో ఈజీగా చేరిపోయేదని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న భారీ సినిమాల క్లాష్ వల్ల ఈ సినిమా కలెక్షన్స్ ఇతర సినిమాలతో షేర్ అయిపోయి, తక్కువ వసూళ్ల దగ్గరే ఆగిపోవాల్సి వస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఏదేమైనా శర్వానంద్ తన వంతుగా బెస్ట్ అవుట్‌పుట్ ఇచ్చినా, బిజినెస్ లెక్కలు, థియేటర్ల షేరింగ్ వల్ల సినిమాకు కొంచెం తేడా జరిగిందనే కామెంట్స్ బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ వీకెండ్ లో సెలవులు కలిసి రావడం పబ్లిక్ టాక్ పెరగడంతో మేకర్స్ మరిన్ని షోలను యాడ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా తన అసలైన స్టామినాను చూపిస్తుందో లేదో వేచి చూడాలి.