బుక్ మై షో టాప్ బుకింగ్స్.. MSG ర్యాంక్ ఎంత?

టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు ఇప్పుడు కేవలం కలెక్షన్ల దగ్గరే ఆగిపోలేదు. ఒక సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనే 'ఫుట్‌ఫాల్స్' లెక్కలే ఇప్పుడు అసలైన క్రేజ్‌ను డిసైడ్ చేస్తున్నాయి.;

Update: 2026-01-18 07:03 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలు ఇప్పుడు కేవలం కలెక్షన్ల దగ్గరే ఆగిపోలేదు. ఒక సినిమాకు ఎన్ని టికెట్లు అమ్ముడయ్యాయి అనే 'ఫుట్‌ఫాల్స్' లెక్కలే ఇప్పుడు అసలైన క్రేజ్‌ను డిసైడ్ చేస్తున్నాయి. ముఖ్యంగా బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌లో నమోదయ్యే టికెట్ సేల్స్ ఆధారంగా సినిమాల పాపులారిటీని అంచనా వేస్తున్నారు. లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) ఈ రేసులో దూసుకుపోతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం, టాప్ తెలుగు సినిమాల టికెట్ సేల్స్ లిస్ట్‌లో మెగాస్టార్ చిత్రం ఇప్పటికే 8వ స్థానాన్ని దక్కించుకుంది. సంక్రాంతి సీజన్ ఇంకా కొనసాగుతుండటంతో, ఫుల్ రన్ ముగిసే సమయానికి ఈ సినిమా 6వ స్థానానికి చేరుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. పక్కా తెలుగు కమర్షియల్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం, పాన్ ఇండియా సినిమాల సరసన నిలబడటం విశేషం.

ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్ పుష్ప 2 ఏకంగా 20 మిలియన్లకు పైగా టికెట్ సేల్స్‌తో ఎవరికీ అందనంత ఎత్తులో ఉంది. ఆ తర్వాత ప్రభాస్ నటించిన కాల్కి 2898 AD 13 మిలియన్ల సేల్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. ఈ భారీ సినిమాల మధ్య మెగాస్టార్ మన శంకర వరప్రసాద్ గారు కేవలం ఆరు రోజుల్లోనే 2.81 మిలియన్ల టికెట్లను అమ్ముడుపోవడం చూస్తుంటే, థియేటర్ల వద్ద మెగా మాస్ హవా ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఈ సంక్రాంతికి పోటీగా ఉన్న ఇతర సినిమాల కంటే MSG బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. గతంలో సంక్రాంతికి వచ్చిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ (2.25 మిలియన్లు), అలాగే గత ఏడాది వచ్చిన తేజ సజ్జ మిరాయ్ (2.1 మిలియన్లు),OG : 2.8M+, వంటి క్రేజీ సినిమాల రికార్డులను ఇప్పటికే ఈ మెగా మూవీ క్రాస్ చేసింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీకి తోడు, చిరంజీవి వింటేజ్ స్వాగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తోంది.

పండగ సెలవులు ముగిసినా ఈ జోరు తగ్గకపోవడంతో, త్వరలోనే ఈ సినిమా సంక్రాంతి కి వస్తున్నాం రికార్డును కూడా దాటేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న ట్రెండ్ ప్రకారం, ఈ వీకెండ్ ముగిసే నాటికి ఈ లిస్ట్‌లో మెగాస్టార్ మరింత పైకి వెళ్లడం ఖాయం. ఒక ప్యూర్ రీజినల్ సినిమాగా ఉంటూనే, భారీ వసూళ్లు, టికెట్ సేల్స్ సాధించడం చిరంజీవికే చెల్లిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

బుక్ మై షోలో టాప్ టికెట్ సేల్స్ సాధించిన తెలుగు సినిమాలు:

పుష్ప 2 : 20M+

కాల్కి 2898 AD : 13M+

సలార్ : 7M+

దేవర : 4.8M+

హనుమాన్ : 4.7M+

సంక్రాంతికి వస్తున్నాం : 3.6M+

మన శంకర వరప్రసాద్ గారు : 2.81M+ (6days)

OG : 2.8M+

గేమ్ చేంజర్ : 2.25M+

మిరాయ్ : 2.1M+

Tags:    

Similar News