మాస్ రాజాకి క్లారిటీ వచ్చినట్టేనా..?
మాస్ మహరాజ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి రిలీజైంది. పొంగల్ ఫైట్ లో వచ్చిన ఐదు సినిమాల్లో అన్నిటికీ పాజిటివ్ టాక్ వచ్చింది.;
మాస్ మహరాజ్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా సంక్రాంతికి రిలీజైంది. పొంగల్ ఫైట్ లో వచ్చిన ఐదు సినిమాల్లో అన్నిటికీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఏ ఒక్క సినిమాకు కూడా నెగిటివ్ టాక్ అంటే ఫ్లాప్ టాక్ ఐతే రాలేదు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా మాత్రం రవితేజ వరుస ఫ్లాపుల నుంచి బయట పడేసింది. ఐతే సినిమా ఓ సూపర్ హిట్ అనే మూమెంట్ లేదు కానీ రవితేజ చివరి 3 సినిమాల ఫలితాలతో పోలిస్తే మాత్రం బెటర్ అని చెప్పొచ్చు.
మాస్ రాజా భర్త మహాశయులకు విజ్ఞప్తి..
కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా లో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ ఇద్దరు హీరోయిన్స్ నటించారు. సినిమాలో ఆషిక గ్లామర్ షో ప్లస్ అయ్యింది. ఐతే మాస్ రాజా భర్త మహాశయులకు విజ్ఞప్తి యావరేజ్ టాక్ సినిమాకు కాస్త ప్రోత్సాహాన్ని ఇచ్చినా సంక్రాంతికి మిగతా సినిమాలకు ఇంకాస్త ఎక్కువ బజ్ రావడంతో ఆ ఎఫెక్ట్ ఈ సినిమా మీద పడింది.
సంక్రాంతి ఫైట్ లో వచ్చిన రాజా సాబ్ పూర్తిగా డిజప్పాయింట్ కాగా.. మన శంకర వరప్రసాద్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత అనగనగా ఒకరాజు, నారి నారి నడుమ మురారి సినిమాలు రెండు మంచి టాక్ తో దూసుకెళ్తున్నాయి. భర్త మహాశయులకు విజ్ఞప్తి మాత్రం స్లోగా రన్ అవుతుంది. ఐతే రవితేజ ఈ సినిమా పై మొదటి నుంచి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మాస్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి..
ఈ సినిమా ఇచ్చిన జోష్ తో రవితేజ మళ్లీ తన ఎనర్జీని డబల్ చేసుకుని నెక్స్ట్ సినిమాలకు పనిచేస్తాడు. రవితేజ శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా లాక్ చేసుకున్నాడు. భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో ఆడియన్స్ తనను ఎలా చూడాలని అనుకుంటున్నారో రవితేజకు తెలిసింది కాబట్టి రెగ్యులర్ మాస్ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలతో వస్తే బెటర్ అని చెప్పొచ్చు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా చూసిన మాస్ రాజా ఫ్యాన్స్ కూడా సాటిస్ఫైడ్ అవుతున్నారు. సో ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో రవితేజ మాస్ కాదు ఇక మీదట ఎంటర్టైన్మెంట్ ప్రాధాన్యత ఉన్న ప్రాజెక్ట్ లు చేస్తే బెటర్ అనిపిస్తుంది.
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా రవితేజ వరుస సినిమాలు చేస్తాడు. కానీ మాస్ జాతర ఫ్లాప్ తో కాస్త ఆలోచనలో పడ్డ రవితేజ మాస్ కాదు ఆడియన్స్ ని మెప్పించే ఎంటర్టైనింగ్ కథలు చేయాలని ఫిక్స్ అయ్యారు. కిషోర్ తిరుమల తో కలిసి అనుకున్న టైం లోనే సినిమా పూర్తి చేసి రిలీజ్ చేశారు.