మెగాస్టార్ విధ్వంసం.. తమ్ముడి రికార్డులను బ్రేక్ చేసిన అన్నయ్య!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి.;

Update: 2026-01-18 08:15 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇప్పుడు ఒక పేరు గట్టిగా వినిపిస్తోంది. అదే మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు (MSG) సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. పండగ విన్నర్‌గా నిలవడమే కాదు, ఏకంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తోంది. ముఖ్యంగా తమ్ముడు పవన్ కళ్యాణ్, కొడుకు రామ్ చరణ్ సృష్టించిన రికార్డులను ఈ వయసులో చిరంజీవి బ్రేక్ చేస్తుండటం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అసలు మ్యాటర్ లోకి వస్తే, బుక్ మై షో సేల్స్ లో ఈ మెగా మూవీ ఒక ఫీట్ సాధించింది. పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా ఫుల్ రన్ లో సాధించిన 2.78 మిలియన్ల టికెట్ సేల్స్ రికార్డును, మన శంకర వరప్రసాద్ గారు కేవలం ఆరు రోజుల్లోనే క్రాస్ చేసేసింది. ప్రస్తుతం 2.81 మిలియన్లకు పైగా టికెట్ సేల్స్‌తో బాక్సాఫీస్ వద్ద అన్నయ్య సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. తమ్ముడి సినిమా లైఫ్ టైమ్ సేల్స్ ని అన్నయ్య కేవలం వారం లోపే దాటేయడం మెగా పవర్ కు నిదర్శనం.

కేవలం తమ్ముడి రికార్డులే కాదు, కొడుకు రామ్ చరణ్ సినిమా రికార్డులపై కూడా మెగాస్టార్ దండయాత్ర చేశారు. గతంలో RRR సినిమా పేరు మీద ఉన్న డే 5 కలెక్షన్స్ ఇండస్ట్రీ రికార్డును MSG బ్రేక్ చేసింది. ఐదో రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచి, చరణ్ రికార్డును చిరంజీవి చెరిపేశారు. ఇక ఏపీ, తెలంగాణలో ఆరో రోజు అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో కూడా అనిల్ రావిపూడి సినిమాలే టాప్ లో ఉండటం విశేషం. సంక్రాంతికి వస్తున్నాం 14.05 కోట్లు, తర్వాత MSG 13.85 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఇక ఓవర్సీస్ బాక్సాఫీస్ లో కూడా మెగాస్టార్ మేనియా మామూలుగా లేదు. నార్త్ అమెరికాలో సైరా నరసింహారెడ్డి రికార్డులను అధిగమించి, చిరంజీవి కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా ఈ సినిమా నిలిచింది. త్వరలోనే అక్కడ 3 మిలియన్ డాలర్ల మార్కును టచ్ చేయబోతోంది. కేవలం ఆరు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, క్లీన్ హిట్ స్టేటస్ అందుకోవడం మెగాస్టార్ రేంజ్ ఏంటో చూపిస్తోంది.

మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ల ప్రకారం, ఈ సినిమా కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ స్పీడ్ చూస్తుంటే అతి త్వరలోనే 300 కోట్ల క్లబ్ లో చేరడం పక్కాగా కనిపిస్తోంది. ఇండస్ట్రీ హిట్ ట్రాక్ లో దూసుకుపోతున్న ఈ సినిమా, రీజినల్ సినిమాల కేటగిరీలో ఆల్ టైమ్ రికార్డులను బద్దలు కొట్టేలా ఉంది. బాక్సాఫీస్ వద్ద అన్నయ్య వేస్తున్న అడుగులకు ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతోంది.

పక్కా కమర్షియల్ బొమ్మ పడితే మెగాస్టార్ బాక్సాఫీస్ ని ఎలా ఏలుతారో MSG సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. అనిల్ రావిపూడి కామెడీ, చిరంజీవి మాస్ స్వాగ్ తోడవ్వడంతో జనం థియేటర్లకు బ్రహ్మరథం పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News