గుణశేఖర్ 'శకుంతల'.. పూజా హెగ్డే?
కమర్షియల్ మూవీలకూ తనదైన కళాత్మకతను జోడించి అద్భుతమైన కళాఖండాలుగా ఆవిష్కరించగలడు దర్శకుడు గుణశేఖర్. గతంలో ఆయన రూపొందించిన చిత్రాలను పరిశీలిస్తే.. తప్పక ‘ఔను’ అనాల్సిందే. అలాంటి ఎన్నో చిత్రాలను తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మధ్య 'రుద్రమదేవి' పేరుతో చారిత్రాత్మక కథా చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించి అబ్బుపరిచారు.
ఆ చిత్రం తర్వాత గుణశేఖర్ వార్ రూమ్ నుంచి 'హిరణ్యకశ్యప' అనే పౌరాణిక చిత్రం అనౌన్స్ అయ్యింది. రానా దగ్గుబాటి టైటిల్ రోల్ పోషించే ఈ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేశారు. అయితే.. ఏమైందోకానీ.. ప్రస్తుతానికి ఆ 'హిరణ్యకశ్యప'ను సైడ్ ట్రాక్ లో పెట్టి, ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని ఫ్రేమ్ లోకి తెచ్చారు గుణశేఖర్.
‘శాకుంతలం’ పేరుతో మరో చిత్రాన్ని ప్రకటించారు గుణశేఖర్. అంతేకాదు.. ఇటీవల దీనికి సంబంధించిన టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ‘‘వెండితెరపై 'హిరణ్య కశ్యప'లో నరసింహావతారాన్ని సాక్షాత్కరింపజేసే ముందు.. భారతాన ఆదిపర్వంలోని ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తూ.." అని పేర్కొంటూ గుణశేఖర్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
అయితే.. గుణశేఖర్ ‘శకుంతల’ ఎవరనేది సస్పెన్స్ గా మారింది. ‘శాకుంతలం’ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచీ ఎవరా శకుంతల? అనే చర్చ మొదలైంది. ఇందుకోసం పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో టైటిల్ పాత్ర కోసం గుణశేఖర్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించారట.
మరి, పూజా రిప్లే ఏంటనేది తెలియలేదు. ఇతర నటీనటులు ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో సెట్స్‌కి తీసుకెళ్లాలని గుణశేఖర్ యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.