మెగా ఇంటికి పిల్లలు వెళ్తామంటే అలాంటి కండిషన్ పెట్టా - రేణు దేశాయ్

టాలీవుడ్ లో నటిగా, దర్శకురాలిగా, అంతకుమించి ఇద్దరు పిల్లల బాధ్యతగల తల్లిగా రేణూ దేశాయ్ అందరికీ సుపరిచితులే.;

Update: 2026-04-28 05:57 GMT

టాలీవుడ్ లో నటిగా, దర్శకురాలిగా, అంతకుమించి ఇద్దరు పిల్లల బాధ్యతగల తల్లిగా రేణూ దేశాయ్ అందరికీ సుపరిచితులే. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ సామాజిక అంశాలపై స్పందించే ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల పెంపకం గురించి ఎమోషనల్ అవుతూనే, బయట తనకు ఎదురవుతున్న కొన్ని ఇబ్బందికర పరిస్థితులపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. ఆ వివరాలు ఇలా వున్నాయి ..

పిల్లల పెంపకంపై ఎమోషనల్ బాండింగ్:

రేణూ దేశాయ్ తన పిల్లలు అకీరా, ఆధ్యలను ఎంతో క్రమశిక్షణతో పెంచుతున్నారు. పిల్లల ప్రవర్తనే తల్లి పెంపకానికి అద్దం పడుతుందని ఆమె బలంగా నమ్ముతారు. అలాగే పిల్లల్ని ఫ్యామిలీ (మెగా)కి దగ్గర చేయాలనుకున్నప్పుడు వారికి ఒకటే కండిషన్ పెట్టాను.. "మీరు వాళ్లతో ఎలా బిహేవ్ చేస్తారో అదే నా పెంపకం.. నా పెంపకాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లతో బిహేవ్ చేయండి. అలాగే సమాజంలో కూడా వ్యక్తులతో మాట్లాడే తీరు గురించి కూడా నా పెంపకం రిఫ్లెక్ట్ అవుతుందని" పిల్లలకు ఎప్పుడూ చెబుతుంటానని ఆమె ఎమోషనల్ అయ్యారు. ఒక రకంగా పిల్లల బాధ్యతను వారికి గుర్తుచేస్తూనే, తన పెంపకంపై మచ్చ పడకుండా చూసుకోవాలని కోరారు.

తల్లి పెంపకానికే మొదటి మార్కులు:

పిల్లలు ఎక్కడైనా తప్పు చేస్తే లోకం ముందుగా తండ్రిని కాకుండా తల్లి పెంపకాన్నే ప్రశ్నిస్తుందని రేణూ అభిప్రాయపడ్డారు. ఎవరైనా పిల్లలు తప్పుగా ప్రవర్తిస్తే "తల్లి సరిగ్గా పెంచలేదేమో" అనే మాట వస్తుందని, అందుకే తన పిల్లలకు విలువల గురించి ప్రత్యేకంగా నేర్పించానని వెల్లడించారు. ఇక ఇతరులను గౌరవించడం, మర్యాదగా మాట్లాడటం అనేవి తన పెంపకంలో ప్రధాన భాగమని ఆమె చెప్పుకొచ్చారు.

సెల్ఫీల గొడవ.. షాకింగ్ కామెంట్స్:

ఇక ఇంటర్వ్యూలో రేణూ ఒక షాకింగ్ విషయాన్ని పంచుకున్నారు. సెలబ్రిటీలుగా బయటకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే ఇబ్బందుల గురించి మాట్లాడుతూ.. మగవారి కంటే ఆడవాళ్లే తనను ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. సాధారణంగా మగవారు ఫోటో అడిగినప్పుడు 'వద్దు' అని చెబితే విని పక్కకు వెళ్తారని, కానీ మహిళలు మాత్రం అస్సలు వినరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మీదకు వచ్చి మరీ ఇబ్బంది పెడుతున్నారు:

"నేను మీ పెద్ద ఫ్యాన్ మేడం" అంటూ ఆడవారు మీదకు వచ్చేస్తారని, వద్దన్నా వినకుండా ఒక్క సెల్ఫీ ప్లీజ్ అంటూ ఒత్తిడి చేస్తారని రేణూ తెలిపారు. ప్రైవసీ లేకుండా అలా మీదకు రావడం ఒక్కోసారి చాలా ఇబ్బందిగా, అసహనంగా అనిపిస్తుందని ఆమె కుండబద్దలు కొట్టారు. అభిమానం ఉండాలి కానీ అది అవతలి వారిని ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని ఆమె పరోక్షంగా చురకలు అంటించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలిగా రేణూ:

కేవలం నటనకే పరిమితం కాకుండా కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా, నిర్మాతగా రేణూ దేశాయ్ తన సత్తా చాటుతున్నారు. రవి తేజ మూవీ 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాతో వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చిన ఆమె, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా పిల్లల భవిష్యత్తు కోసం, వారి పెంపకం కోసం ఆమె పడుతున్న తపన చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

రేణూ దేశాయ్ మాటలు వింటే ఆమె పిల్లల పట్ల ఎంత బాధ్యతగా ఉన్నారో అర్థమవుతుంది. అదే సమయంలో అభిమానులు కూడా తమ పరిధి దాటి ప్రవర్తించకూడదనే చేదు నిజాన్ని ఆమె బయటపెట్టారు. ఒక తల్లిగా ఆమె ఆవేదన, ఒక సెలబ్రిటీగా ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మాతృత్వానికి ప్రాణం ఇచ్చే రేణూ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Tags:    

Similar News