అడివి శేష్ గుండె గట్టిది..!
ఈ జనరేషన్ కుర్రాళ్లు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించినా, మెంటల్‌గా చాలా వీక్‌గా ఉంటున్నారు.;
ఈ జనరేషన్ కుర్రాళ్లు ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా కనిపించినా, మెంటల్‌గా చాలా వీక్‌గా ఉంటున్నారు. చిన్న విషయాలకు డిప్రెషన్‌కి వెళ్లి పోయి, చివరకు ఉసురు వరకు వెళ్తున్నారు. కొందరు మాత్రమే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, హార్ట్ బ్రేకింగ్ సంఘటనలు జరిగినా నిలదొక్కుకుంటున్నారు. అలా నిలదొక్కుకున్న వారు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. పలువురు ఫెయిల్యూర్స్ ను ఎదుర్కొని జీవితంలో సక్సెస్ అయిన వారు ఉన్నారు. కానీ కొందరు ఫెయిల్యూర్ రాగానే జీవితమే పోయింది అన్నట్లుగా బాధపడి పోతున్నారు. ముఖ్యంగా ఈతరం యువతలో ఎక్కువ మంది లవ్ ఫెయిల్యూర్‌తో జీవితాలను వదిలేస్తున్న వారు ఉన్నారు. కానీ కొద్ది మంది మాత్రమే లవ్ ఫెయిల్యూర్‌తో జీవితంపై కసి ఏర్పర్చుకుని ముందుకు సాగుతున్నారు. అలాంటి వారు విజయాన్ని సొంతం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు ఉన్నారు. లవ్ ఫెయిల్ అయ్యి కెరీర్‌లో సక్సెస్ అయిన వారిలో టాలీవుడ్ హీరో అడవి శేష్ ఒకరు.
సొంత కథలతో అడవి శేష్ సినిమాలు...
టాలీవుడ్‌లో చిన్న నటుడిగా కెరీర్‌ను ఆరంభించిన అడవి శేష్ తక్కువ సమయంలోనే మంచి ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన సొంత కథలను రెడీ చేసుకుని, తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఈ మధ్య కాలంలో అడవి శేష్ 'డెకాయిట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన ఆ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రాలేదు అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్. డెకాయిట్ కమర్షియల్ ఫలితాన్ని పక్కన పెడితే, మరో మంచి సబ్జెక్ట్‌తో అడివి శేష్ వచ్చాడు అనే పేరును దక్కించుకున్నాడు. కథల ఎంపిక విషయంలో ఇతర యంగ్ హీరోలు కచ్చితంగా అడవి శేష్ ను చూసి నేర్చుకోవాల్సిందే అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా డెకాయిట్...
డెకాయిట్ సినిమా ప్రమోషన్ సమయంలో అడవి శేష్ చాలా యాక్టివ్‌గా కనిపించాడు. సాధారణంగా కూడా అడవి శేష్ తన సినిమాల ప్రమోషన్స్‌లో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటాడు. కానీ ఈసారి అంతకు మించి అన్నట్లుగా అడవి శేష్ యాక్టివ్‌గా కనిపించాడు. రీల్స్ మొదలుకుని సోషల్ మీడియా ఇన్ఫ్యూలెన్సర్స్ వరకు అందరితోనూ ఇంట్రాక్ట్ అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో అడివి శేష్ తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చాడు. తాను రెండు సార్లు ప్రేమలో పడ్డట్లుగా చెప్పిన అడవి శేష్, ఆ రెండు సార్లు కూడా ఫెయిల్ అయ్యానని ఆవేదన వ్యక్తం చేశాడు. ముఖ్యంగా మొదటి లవ్ సినిమాటిక్‌గా ఫెయిల్ అయ్యిందట. అడవి శేష్ ను ప్రేమించిన ఆమె కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పి విడి పోయిందట. అంతకంటే విషాదం ఏంటంటే అడవి శేష్ బర్త్ డే రోజు ఆమె మరొకరిని వివాహం చేసుకుందట. తన బర్త్ డే రోజు ఆమె మరొకరిని వివాహం చేసుకోవడం కాస్త ఇబ్బందిని కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.
వరుస సినిమాలతో అడవి శేష్...
మొదటి ప్రేయసి పెళ్లి చేసుకున్న కొన్నాళ్ల తర్వాత మరొకరితో శేష్ ప్రేమలో పడ్డడట. మళ్లీ శేష్ కి నిరాశే మిగిలింది. రెండో ప్రేయసి కూడా శేష్ ని మధ్యలోనే విడిచి వెళ్లింది. ఆమె చనిపోయిందని తెలిసి అడవి శేష్ క్రుంగి పోయాడట. ఈ విషయాన్ని గురించి ఆయన నార్మల్‌గానే చెబుతున్నప్పటికీ ఆయన గుండెలో ఎంతో భారం ఉండి ఉంటుందని ఆయన అభిమానులు అంటున్నారు. లవ్ ఫెయిల్యూర్ కాగానే గడ్డం పెంచుకుని, జుట్టు పెంచుకుని రోడ్ల పై తిరగకుండా అడవి శేష్ కెరీర్ పై దృష్టి పెట్టడం మంచి విషయం. మరింత కసిగా శేష్ కష్టపడి సినిమాల్లో హిట్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతూనే ఉన్నాడు. అడవి శేష్ మళ్లీ ప్రేమలో పడుతాడా అనేది కాలమే నిర్ణయించాలి.