మెగా158 లుక్.. ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రాసాద్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తరువాత ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.;
మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రాసాద్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న తరువాత ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తాడా అని ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తర్వాతి సినిమా అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఒక క్రేజీ హింట్ దొరికింది. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు బాబీతో మెగాస్టార్ మళ్ళీ కలుస్తుండటంతో అంచనాలు ఒక రేంజ్‌లో ఉన్నాయి. లేటెస్ట్ గా వీరి న్యూస్ ప్రాజెక్టుకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మెగా158 మూవీకి సంబంధించి లుక్ టెస్ట్ సక్సెస్‌ఫుల్ గా పూర్తయింది. ఈ సినిమాలో చిరంజీవి మునుపెన్నడూ చూడని ఒక కొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. దీనికోసం బాబీ ఒక పక్కా మాస్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కేవలం ఎలివేషన్లు మాత్రమే కాకుండా, విజువల్ గా కూడా సినిమా చాలా ఇంటెన్సివ్ గా ఉండబోతోందని తెలుస్తోంది. తాజాగా బయటకు వచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో మెగాస్టార్ వెనక నుంచి కనిపిస్తుండగా, బాబీ థమ్స్ అప్ చూపిస్తూ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ లుక్ టెస్ట్ తో సినిమా ఎలా ఉండబోతుందనే దానిపై ఇండస్ట్రీలో ఇప్పుడే చర్చ మొదలైంది.
ఈ చిత్రాన్ని కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె. నారాయణ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గతంలో ఈ కాంబోలో వచ్చిన సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేయడంతో, ఈసారి కూడా అదే లెవల్ మాస్ ఎలిమెంట్స్ ఉండేలా బాబీ ప్లాన్ చేశారు. కథలో ఉండే ఇంటెన్సిటీకి తగ్గట్టుగా చిరంజీవి పాత్రను చాలా పవర్‌ఫుల్ గా డిజైన్ చేసినట్లు సమాచారం. అందుకే లుక్ టెస్ట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. త్వరలోనే ఈ సినిమా ముహూర్తం షాట్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ వివరాలను టీమ్ అధికారికంగా వెల్లడించనుంది.
టెక్నికల్ గా కూడా ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉండబోతోంది. ‘కాకాజీ’ అనే టైటిల్ చర్చల్లో ఉన్నట్లు వార్తలు వస్తుండటంతో, ఆ పేరుకు తగ్గట్టుగానే బెంగాల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయని టాక్. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించన్నున్నట్లు ఇదివరకే హింట్ వచ్చింది. ఇక చిరంజీవి సరసన ప్రియమణి హీరోయిన్ అని టాక్, ఇతర కీలక పాత్రల్లో మోహన్ లాల్, అనురాగ్ కశ్యప్ వంటి నటులు కూడా ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఏదేమైనా గత వారం నుంచి ఊరిస్తున్న మెగా158 ప్రయాణం అధికారికంగా మొదలైంది. లుక్ టెస్ట్ పూర్తవ్వడంతో ఇక సెట్స్ పైకి వెళ్లడమే. షూటింగ్ ఆలస్యమవుతుందనే వార్తలకు ఈ అప్‌డేట్ తో టీమ్ చెక్ పెట్టింది. బాబీ తన టీమ్ తో కలిసి షెడ్యూల్స్ ను పక్కాగా రెడీ చేస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలో మెగా మాస్ జాతర ఉండేలా ప్లానింగ్ జరుగుతోంది. మరి ఈ కొత్త లుక్ లో చిరంజీవి తన విశ్వరూపాన్ని ఎలా చూపిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.