2028 లో రెండు సినిమాలతో డార్లింగ్!
| రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతూనే మరోవైపు వాటి షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే లైనప్‌లో ఉన్న మోస్ట్ అవేటెడ్ సినిమాల విడుదల తేదీలపై ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. 2027 - 2028 సంవత్సరాలను ప్రభాస్ సినిమాలతో పూర్తిగా ఏలబోతున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తుంది.
ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల రిలీజ్ డేట్స్ ప్లానింగ్ ఓ రేంజ్‌లో ఉంది. ముందుగా 2027 మార్చి 19న హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా `ఫౌజీ` ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా అనంరతం అదే ఏడాది అక్టోబర్ 2న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `స్పిరిట్` థియేటర్లలోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ రెండు చిత్రాలు 2027 ఏడాదిని సినిమా ప్రియులకు పండగలా మార్చడం ఖాయం.
అయితే అసలు సిసలు బాక్సాఫీస్ విధ్వంసం మాత్రం 2028లో జరగబోతోంది. 2028 లో ప్రభాస్ రెండు భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సమ్మర్ కానుకగా ఇండియన్ సినిమా చరిత్రలోనే నిలిచిపోయే `కల్కీ 2898 ఏడీ` సీక్వెల్ `కల్కీ 2` చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అదే ఏడాది చివర్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మాస్ యాక్షన్ మానియా `సలార్: పార్ట్ 2 - శౌర్యాంగ పర్వం` సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద గతంలో సరికొత్త రికార్డులు సృష్టించిన `సలార్` చిత్రానికి ఇది సీక్వెల్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. సమ్మర్‌లో `కల్కీ 2` తో విజువల్ ట్రీట్ ఇచ్చి ఏడాది చివర్లో `సలార్ 2` తో మాస్ యాక్షన్ ఫీస్ట్ అందించడానికి ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వేశారు.
ఒక స్టార్ వరుసగా ఇలా భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌లను ఒకదాని తర్వాత ఒకటి లైన్లో పెట్టడం ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారై కావొచ్చు. ప్రభాస్ మార్కెట్ రేంజ్ ఏంటో ఈ లైనప్ చూస్తేనే అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా హాలీవుడ్ స్థాయి విజువల్స్ నుంచి బాలీవుడ్ మాస్ సినిమాల వరకు అన్ని జోనర్లలో సత్తా చాటేందుకు డార్లింగ్ సిద్ధమవుతున్నారు. వరుస చిత్రాల విడుదల తేదీలతో బాక్సాఫీస్ రికార్డులన్నీ తిరగరాయడం ఖాయం.