పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?
| టాలీవుడ్ ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్... కెరియర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్... కెరియర్ స్టార్టింగ్ లోనే స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు. టైర్ వన్ హీరోలందరికి చిరస్మరణీయమైన సక్సెస్ లను అందించిన ఘనత ఆయనది. ప్రస్తుతం పాన్ ఇండియా రేసు లో ఆయన వెనుకబడిపోవడం, ఆశించిన విజయాలు అందకపోవడం ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకి గురి చేస్తుంది..
స్లమ్ డాగ్ పరిస్థితేంటి?
ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 'స్లమ్ డాగ్' మూవీ ఇప్పటికి రిలీజ్ కావడం లేదు. గతంలో ఆయన చేసిన 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' మూవీస్ ప్లాప్ అయ్యాయి. దాంతో ఆయన మిగతా స్టార్ డైరక్టర్ల కంటే వెనుకబడిపోయాడు. మరోసారి తన స్టాండర్డ్ ను చూపిస్తూ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది.
మిగతా స్టార్ డైరెక్టర్ల కంటే వెనకబడిపోయాడా?
ప్రస్తుతం ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, సుకుమార్ టాప్ పొజిషన్ లో ఉన్నారు. పూరి జగన్నాథ్ కూడా వీళ్ళ జనరేషన్ కి తగ్గ దర్శకుడే...కాబట్టి ఆయన ఈ దర్శకులతో పోలిస్తే కొంతవరకు వెనకబడిపోయాడు. మరోసారి తన పెన్ను కి పని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. కొత్త దర్శకులు వచ్చి మ్యాజిక్ చేస్తుంటే ఎప్పటి నుంచో ఇండస్ట్రీ లో ఉంటూ స్టార్ హీరోలకు సక్సెస్ లను అందించిన పూరి వెనకబడి పోవడం ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వీలైనంత తొందరగా తను బౌన్స్ బ్యాక్ అయితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కథల విషయంలో కేర్ తీసుకోవాల్సిందేనా
ఒకప్పుడు వారం రోజుల్లో కథలను రాసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన పూరి. తక్కువ టైమ్ లో క్వాలిటీ కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో సరైన కథలు రావడం లేదు. కాబట్టి పూరి మరోసారి తన వింటేజ్ రైటర్ ను బయటికి తీస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఆయన చేసిన స్లమ్ డాగ్ తో సక్సెస్ ను సాధిస్తే ఆయన మరోసారి తన మాస్ ఏరా ను పరిచయం చేసినవాడవుతాడు.