సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్రమే!
| కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రానికి చేరువవుతున్నారు. విభిన్న కథా పాత్రలతో, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య ప్రయాణంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లో ల్యాండ్ మార్క్ చిత్రానికి చేరువవుతున్నారు. విభిన్న కథా పాత్రలతో, అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న సూర్య ప్రయాణంలో సరికొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే సుదీర్ఘమైన కెరీర్‌లో వైవిధ్యమైన చిత్రాలు చేసిన సూర్య ల్యాండ్‌మార్క్ 50వ సినిమా విషయంలో పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. 50వ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో సూర్య `కంగువ` సినిమాతో భారీ పాన్ ఇండియా ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఆ సినిమా ఫలితం తర్వాత సూర్య ఆచితూచి అడుగులు వేస్తూ మళ్లీ స్ట్రాంగ్ జోనర్ అయిన రీజినల్ మార్కెట్ క్లాస్, మాస్ సబ్జెక్ట్‌లపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన కెరీర్‌లో 47వ సినిమాను పూర్తి చేసే పనిలో ఉండగా మరోవైపు వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అయితే ఈ చిన్న బ్రేక్‌లు.. రీజినల్ చిత్రాల తర్వాత ఆయన వేయబోయే అసలు సిసలు మాస్టర్ ప్లాన్ మాత్రం వేరే లెవెల్‌లో ఉండబోతోంది.
ఇప్పటికే కెరీర్‌లో 48వ సినిమా పనుల్లో నిమగ్నమై ఉన్న సూర్య రాబోయే రోజుల్లో లైనప్‌ను మరింత స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సూర్య 49వ చిత్రం పూర్తయిన వెంటనే ప్రతిష్టాత్మకమైన 50వ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేయాలని ఫిక్స్ అయ్యారట. `కంగువ` అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎలాంటి లోపాలకు తావు లేకుండా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథను ఎంచుకోవాలని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులరు నచ్చేలా అన్ని వర్గాలకూ కనెక్ట్ అయ్యే ఓ బలమైన స్క్రిప్ట్ కోసం అప్పుడే అన్వేషణ మొదలుపెట్టినట్లు సమాచారం.
ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న తరుణంలో సూర్య లాంటి వర్సటైల్ యాక్టర్ నుంచి మరో భారీ ప్రాజెక్ట్ వస్తుందంటే అంచనాలు తారస్థాయిలో ఉంటాయి. గతంలో ఆయన చేసిన ప్రయోగాలు కొన్ని వర్కౌట్ కాకపోయినా? నటుడిగా ఆయనపై ఉండే నమ్మకం చెక్కుచెదరలేదు. ఈ నేపథ్యంలో 50వ మైలురాయి చిత్రాన్ని తమిళ చిత్ర పరిశ్రమకే పరిమితం చేయకుండా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే రేంజ్‌లో రూపొందించాలని సూర్య కసితో ఉన్నారు.
ఈ ప్రాజెక్ట్ కోసం సూర్య టాలీవుడ్, బాలీవుడ్ .. పాన్ ఇండియా స్థాయిలో పేరున్న టాప్ డైరెక్టర్లతో చర్చలు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథా చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నా? సూర్య మాత్రం ఈసారి ఏమాత్రం రాజీ పడకుండా పర్ఫెక్ట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆయన మేకింగ్ స్టైల్, యాక్షన్ ప్యాక్డ్ రోల్స్‌కు ప్యాన్ ఇండియా వాతావరణం తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నెలకొనడం ఖాయం.