• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కత్తులతో కాళికావతారం.....

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

| రష్మిక మందన్న కెరీర్ లో ఎప్పుడూ చూడని కొత్త అవతారం ఇది. గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ కన్నడ బ్యూటీ, మొదటిసారి పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా మైసా తో పాన్ ఇండియా రేంజ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

By - M Prashanth
Update: 2026-11-02 18:24 GMT

రష్మిక మందన్న కెరీర్ లో ఎప్పుడూ చూడని కొత్త అవతారం ఇది. గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ కన్నడ బ్యూటీ, మొదటిసారి పూర్తి స్థాయి లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా మైసా తో పాన్ ఇండియా రేంజ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన మొదటి పాట ఓ మైసా రే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. చేతిలో కత్తులు, ఒంటిపై రక్తపు మరకలతో రష్మిక ఇచ్చిన ఎంట్రీ చూస్తుంటే సినిమా ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థమవుతోంది.




దర్శకుడు రవీంద్ర పుల్లె ఈ పాటను పిక్చరైజ్ చేసిన విధానం చాలా రా అండ్ రస్టిక్ గా ఉంది. దుష్టశక్తులపై పోరాటానికి దిగేముందు జరిగే ఒక గిరిజన పూజా విధానంలా ఈ పాట హైలెట్ అయ్యింది. నిప్పుల మధ్య రౌద్ర రూపంతో రష్మిక చేసిన క్లాసికల్ తరహా నృత్య భంగిమలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. కాళికా మాత ఆవహించినట్లు ఆమె పలికించిన హావభావాలు, చూపులు ఆడియన్స్ ను వెంటనే ఆకట్టుకుంటున్నాయి. ఆమె చేసిన గత సినిమాలకు ఇది పూర్తి భిన్నమైన రోల్.

సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ అందించిన ట్యూన్ పాటకు అసలైన ప్రాణం పోసింది. అడవి బిడ్డల సంస్కృతిని ప్రతిబింబించే లోకల్ వాయిద్యాలను వాడుతూ ఆయన క్రియేట్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ రిథమ్ హై ఓల్టేజ్ వైబ్ ను తీసుకొచ్చింది. సింగర్ సింధుజ శ్రీనివాసన్ తన పవర్ ఫుల్ వాయిస్ తో పాటకు కావాల్సిన పవర్ ను అందించారు. వింటుంటేనే ఒంట్లో తెలియని ఒక వైబ్రేషన్ కలిగేలా మ్యూజిక్ సాగింది.

సుద్దాల అశోక్ తేజ రాసిన సాహిత్యం పాటలోని భావోద్వేగాన్ని మరింత ఎలివేట్ చేసింది. శత్రువుల గుండెల్లో భయం పుట్టించేలా, న్యాయం కోసం పోరాడే ఒక వీరనారి ఆవేశాన్ని ప్రతిబింబించే పదాలతో పాటను తీర్చిదిద్దారు. తెలంగాణ జానపద యాసతో కూడిన పదాల అమరిక సన్నివేశానికి పక్కాగా సరిపోయింది. కేవలం ఆడియో విన్నప్పుడే కాకుండా, స్క్రీన్ పై విజువల్స్ తో చూసినప్పుడు ఈ లైన్స్ ఇచ్చే ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా అనిపిస్తుంది.

బృందా మాస్టర్ కొరియోగ్రఫీ ఇందులో స్పెషల్ గా నిలిచింది. ఒక హీరోయిన్ తో ఇంత భారీ స్థాయిలో ఫైర్ సెటప్ నడుమ డ్యాన్స్ చేయించడం అంత సులువైన విషయం కాదు. అజయ్ సయ్యపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా నిర్మించిన ఈ చిత్రం విజువల్స్ లో గ్రాండియర్ ను చూపిస్తోంది. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్ట్ మేకింగ్ స్టాండర్డ్స్ నిజంగా చాలా బాగున్నాయి.

నవంబర్ 27న ఐదు భాషల్లో భారీగా రిలీజ్ కాబోతున్న మైసా, రష్మిక కెరీర్ కు బిగ్గెస్ట్ టెస్ట్ లాంటిది. పుష్ప, యానిమల్ సినిమాలతో ఆల్రెడీ నార్త్ లో క్రేజ్ ఉన్నప్పటికీ, సోలో హీరోయిన్ గా మార్కెట్ నిలబెట్టుకోవడానికి ఇలాంటి కంటెంట్ చాలా ముఖ్యం. మొదటి సింగిల్ తోనే అంచనాలను పెంచేసిన ఈ చిత్రం, రాబోయే రోజుల్లో ట్రైలర్ తో ఏ మేరకు సర్ప్రైజ్ చేస్తుందో చూడాలి.


Full View


Tags:    
  • rashmikamandanna 
  • mysaa 
  • omysaare 
  • mysaafirstsingle 
  • jakesbejoy 

Similar News

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

2026-11-02 18:26 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS