'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?
| సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవాలంటే స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. కథ పాతదే ఆయన స్క్రీన్ ప్లే లో వైవిధ్యాన్ని చూపిస్తే సినిమా పక్క గా సక్సెస్ అవుతుంది.
సినిమా సక్సెస్ ఫుల్ గా నిలవాలంటే స్క్రీన్ ప్లే చాలా ముఖ్యం. కథ పాతదే ఆయన స్క్రీన్ ప్లే లో వైవిధ్యాన్ని చూపిస్తే సినిమా పక్క గా సక్సెస్ అవుతుంది. ఇక ఇప్పటి వరకు మనం లీనియర్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ల గురించి విన్నాం, తెలుసుకున్నాం. కానీ రోషమన్ ఎఫెక్ట్ లేదా రోషమన్ థియరీ అనే మరో కొత్త స్క్రీన్ ప్లే టెక్నిక్ ఉందనే విషయం మనలో చాలా మందికి తెలియదు. అసలు రోషమన్ థియరీ అంటే ఏంటి? అది ఎక్కడ నుంచి వచ్చింది. ఆ స్క్రీన్ ప్లే తో వచ్చిన మూవీస్ ఏంటి? ఒకసారి మనం తెలుసుకుందాం...
రోషమన్ ఎఫెక్ట్ / రోషమన్ థియరీ
జపాన్ దేశం లోని ప్రముఖ దర్శకుడైన అకీరా కురోసావా డైరెక్షన్ లో 1950 వ సంవత్సరంలో వచ్చిన 'రోషమన్' అనే మూవీ ఆధారంగా ఈ స్క్రీన్ ప్లే థియరీ వచ్చింది...
రోషమన్ సినిమాలో ఒక హత్య కి సంబంధించిన సంఘటనను చూసిన నలుగురు వ్యక్తులు వాళ్లకు తగినట్లుగా నాలుగు విభిన్న కోణాల్లో దానిని చెబుతుంటారు. దీనివల్ల నిజమెంటనేది తెలుసుకోవడమే అసలు టాస్క్. ఈ ఎంటైర్ స్టోరీ లో మనుషుల స్వార్థం అబద్ధాలు మనిషి కోణాన్ని ఎలా మారుస్తాయో చెప్పే నేరెటివ్ టెక్నిక్ నే 'రోషమన్ ఎఫెక్ట్ లేదా 'రోషన్ థియరీ' అంటారు...
కమల్ హాసన్ తమిళం లో చేసిన 'విరమాండీ' తెలుగులో 'పోతురాజు' సినిమా రోషమన్ ఎఫెక్ట్ తో తెరకెక్కింది.
డ్యూయల్ నేరేషన్
ఈ సినిమాలో జరిగిన ఒకే సంఘటనను ఇద్దరు ప్రధాన పాత్రలు రెండు వేర్వేరు కోణాల్లో చెబుతారు.
మొదటి వెర్షన్ (విలన్ పాయింట్ ఆఫ్ వ్యూ)
సినిమా మొదటి భాగంలో కోదండ రెడ్డి (పశుపతి) జైలు లో కూర్చొని పోతురాజు (కమల్ హాసన్) ఒక క్రూరుడు, హింసవాది ఊరిలో కొందరిని చంపి జైలుకి వచ్చాడని జైలు అధికారికి చెబుతాడు. దీనివల్ల ప్రేక్షకుల్లో పోతురాజు మీద నెగెటివ్ ఇంప్రెషన్ పడుతుంది. అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటి పెరుగుతుంది.
రెండో వెర్షన్ (హీరో పాయింట్ ఆఫ్ వ్యూ)
పోతురాజు (కమల్ హాసన్) మాత్రం తను జైలుకి రావడానికి కారణం ఏంటి? తను ఎలా ఇరికించబడ్డాడు? ఊరు రాజకీయాలకు తను ఎలా బలి అయిపోయాడనే జరిగిన కథను తన కోణంలో వివరిస్తాడు.
రెండు వెర్షన్స్ వింటున్నప్పుడు రెండింటిలోనూ కొన్ని సీన్స్ సిమిలర్ గా వస్తుంటాయి. కానీ దృశ్యాలు అవే ఉన్నప్పటికి వాటి వెనకాల ఉన్న పరిస్థితులు వేరేగా ఉండటం తో స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉందనే అనుభూతి సినిమాను చూసే ప్రేక్షకుడికి కలుగుతుంది. సీన్స్ రిపిటేషన్ తో బోర్ కొట్టించకుండా స్క్రీన్ ప్లే ను చాలా షార్ప్ గా రాసుకున్నాడు... కమల్ హాసన్ ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే అందిస్తూనే డైరెక్షన్ చేశాడు...రోషమన్ థియరీ తో సినిమా చేసి సక్సెస్ ను సాధించిన దర్శకుడిగా కమల్ హాసన్ ఒక ట్రెండ్ క్రియేట్ చేశాడు...