• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రామాయణ' ప్రీ-సేల్స్:...

'రామాయణ' ప్రీ-సేల్స్: అంత‌ర్జాతీయ మార్కెట్ ప్ల‌స్ అవుతోందా?

| భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న `రామాయణ` (పార్ట్ 1) చిత్రం విడుదల ముంగిట సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

By - Sivaji Kontham
Update: 2026-11-02 18:26 GMT

భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న `రామాయణ` (పార్ట్ 1) చిత్రం విడుదల ముంగిట సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా ఐదు భారతీయ భాషల (హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం)తో పాటు ఇంగ్లీష్ వెర్షన్‌లోనూ ఈ చిత్రం భారీగా విడుదల కానుంది. రిలీజ్ తేదీ దగ్గరపడుతుండటంతో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రముఖ ట్రేడ్ పోర్టల్ సాక్‌నిల్క్ సమాచారం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రీ-సేల్స్ ఇప్పటికే రూ. 85 కోట్లకు చేరువయ్యాయి.

భారతదేశంలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా తొలి నాలుగు రోజులకు గాను రూ. 48 కోట్ల ప్రీ-బుకింగ్స్ నమోదవగా.. కేవలం మొదటి రోజు ప్రీ-సేల్స్ ద్వారానే దాదాపు రూ. 26 కోట్లు వసూలయ్యాయి. భారతదేశవ్యాప్తంగా ఇప్పటివరకు 11.36 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడవడం విశేషం. ముఖ్యంగా ఐమ్యాక్స్, 4డిఎక్స్ - డాల్బీ సినిమా వంటి ప్రీమియం ఫార్మాట్లలో షోలు వేగంగా హౌస్‌ఫుల్ అవుతుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. అంతర్జాతీయంగా అడ్వాన్స్ సేల్స్ 3.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 29 కోట్లు) దాటాయి. ముఖ్యంగా అత్యంత కీలకమైన ఉత్తర అమెరికా (USA & కెన‌డా) లో ప్రీమియర్ షోల బుకింగ్స్ ఊహించని రీతిలో జోరుగా సాగుతున్నాయి. అక్కడ ఇప్పటికే ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ప్రీమియర్ ప్రదర్శనలకు టికెట్లు విపరీతంగా అమ్ముడవుతూ.. భారతీయ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను మరోసారి నిరూపిస్తున్నాయి.

దర్శకుడు నితేష్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ మైథాలాజికల్ విజువల్ వండర్ రెండు భాగాల (పార్ట్ 1 & పార్ట్‌ 2) నిర్మాణానికి, గ్లోబల్ ప్రమోషన్లకు కలిపి మొత్తం రూ. 4,000 కోట్లు (500 మిలియన్ డాలర్లు) భారీ బడ్జెట్ ని కేటాయించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో స‌గం బ‌డ్జెట్ మొద‌టి భాగానికి ఖ‌ర్చ‌వుతుంది. ఆస్కార్ విజేత DNEG సంస్థ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్‌పై నమిత్ మల్హోత్రా - మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై హీరో యాష్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యాష్, హనుమంతుడిగా సన్నీ డియోల్ ..లక్ష్మణుడిగా రవి దూబే నటించారు. అంతేకాకుండా ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ .. హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ కలిసి అందిస్తున్న స్వరాలు ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయి ప్రాముఖ్యతను తీసుకువచ్చాయి. అన్ని రకాల హంగులతో నవంబర్ 5న విడుద‌ల‌వుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయంగా కనిపిస్తోంది. భార‌తీయ పురాణేతిహాసాల‌కు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న గౌర‌వం, రామాయ‌ణం అసాధార‌ణ‌మైన క‌థ‌కు ద‌క్కుతున్న గౌర‌వంగా దీనిని భావించాలి.

Tags:    
  • ramayana 
  • ramayanapart1 
  • ranbirkapoor 
  • advancebooking 
  • boxoffice 

Similar News

ప్రతిరోజూ సాంబార్ తింటే ప‌ర‌లోకానికే!

2026-11-02 18:30 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

సెలబ్రిటీల భద్రతపై చిరంజీవి కీలక అడుగు.. కేంద్రం దృష్టికి సమస్య!

2026-11-02 18:24 GMT

కత్తులతో కాళికావతారం.. రష్మిక 'మైసా' పూనకాలు మామూలుగా లేవుగా!

2026-11-02 18:24 GMT

కిల్లింగ్.. స్ట‌న్నింగ్.. ఎన్నారై తెలుగు గాళ్ ఫోటోషూట్ దుమారం

2026-11-02 18:22 GMT

భర్తతో కలిసి క్యూట్‌గా కాజల్ అగర్వాల్.. లేటెస్ట్ ఫొటోలు వైరల్!

2026-11-02 18:21 GMT

'రోషమన్ థియరీ' అంటే ఏంటి? అలాంటి కథ తో వచ్చిన సినిమాలు ఏంటి?

2026-11-02 17:30 GMT

పూరి జగన్నాథ్ పెన్ను లో పవర్ తగ్గిందా?

2026-11-02 16:30 GMT

2028 లో రెండు సినిమాల‌తో డార్లింగ్!

2026-11-02 15:30 GMT

ఫ్రెండు బర్త్‌డే పార్టీలో క‌పూర్ గాళ్ ర‌చ్చ రచ్చ

2026-11-02 15:30 GMT

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

Copyright @2026

Powered by Blink CMS