'కర' తెలుగు ట్రైలర్.. గల్ఫ్ దేశాల యుద్ధం అంటూ..

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కర తెలుగు ట్రైలర్‌ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది.;

Update: 2026-04-28 08:28 GMT

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కర తెలుగు ట్రైలర్‌ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. విభిన్నమైన కథలను ఎంచుకుని ప్రేక్షకులను అలరించే ధనుష్, ఈసారి పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌ తో థియేటర్లలోకి రానున్నారు. పొర్ తొళిల్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విఘ్నేష్ రాజా ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్‌ గా మమత బైజూ నటించారు.




 


ప్రముఖ నటులు కేఎస్ రవికుమార్, సూరజ్ వెంజరమూడు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆ సినిమా ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే తమిళ ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా, రీసెంట్ గా రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్ స్టార్టింగ్ నుంచే యాక్షన్, ఎమోషన్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటోంది.

'ఆరు నెలలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాల యుద్ధం పరాకాష్టకు చేరుకుంది' అనే డైలాగ్‌ తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ డైలాగ్ సినిమాలోని మెయిన్ కాన్సెప్ట్‌ పై ఆసక్తి పెంచుతోంది. గల్ఫ్ దేశాల్లో పనిచేసే భారతీయుల పరిస్థితులు, అక్కడి చట్టాలు, యుద్ధ పరిస్థితులు వారి జీవితాలపై ఎలా ప్రభావం చూపిస్తాయనే అంశాన్ని దర్శకుడు కమర్షియల్ ఎలిమెంట్స్‌ తో చూపించినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.

సినిమాలో ధనుష్ రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారు. ఒకవైపు డబ్బు కోసం ఏదైనా చేసే దొంగగా, మరోవైపు కుటుంబం కోసం కష్టపడే సాధారణ వ్యక్తిగా ఆయన పాత్రను చూపించారు. బ్యాంకులను దోచుకునే సీన్స్, యాక్షన్ సీక్వెన్సులు ట్రైలర్‌ లో హైలైట్‌ గా నిలిచాయి. ధనుష్ డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ లో కనిపించే ఎంటెన్సిటీ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది.

ఇక హీరోయిన్ మమితా బైజు డీగ్లామర్ పాత్రలో కనిపించనున్నారు. ఆమె రోల్ లోని ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేసే అవకాశం ఉంది. మిడిల్ క్లాస్ హౌస్ ఫుల్ గా ఆమె యాక్టింగ్ కథకు బలం చేకూర్చేలా ఉంటుందని ట్రైలర్ చెప్పకనే చెబుతోంది. టెక్నికల్ గా కూడా కర ట్రైలర్ ఆకట్టుకుంటోంది. నేచురల్ విజువల్స్‌ తో కూడిన కెమెరా వర్క్ అట్రాక్ట్ చేస్తోంది. బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌ కు ఎక్స్ ట్రా స్ట్రెంత్ ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే మ్యూజిక్ సినిమాకు మాస్ ఫీల్‌ ను ఇస్తోంది.

అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అయిందని చెప్పాలి. దీంతో సినిమాపై టాలీవుడ్ మూవీ లవర్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నేచురాలిటీ దగ్గరగా ఉండే కథలు ఇష్టపడే వారికి కర మూవీ బెస్ట్ సెలెక్షన్ గా మారే అవకాశం ఉంది. యాక్షన్, ఎమోషన్, రియలిస్టిక్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న కర ఒక ఐ-ఫీస్ట్ మూవీగా నిలిచే సూచనలు మాత్రం ప్రస్తుతం కనిపిస్తున్నాయి. మరి ఏప్రిల్ 30వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న కర సినిమా ఎలా మెప్పిస్తుందో అంతా వేచి చూడాలి.



Full View


Tags:    

Similar News