ఈ హీరోయిన్స్ డెడికేషన్ కి ఫిదా. ప్రెగ్నెన్సీ లో కూడా సత్తా చాటుతున్న బ్యూటీస్!

సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో విశ్రాంతి తీసుకోవాలని అందరూ చెబుతుంటారు.;

Update: 2026-04-28 04:30 GMT

సాధారణంగా గర్భం దాల్చిన సమయంలో విశ్రాంతి తీసుకోవాలని అందరూ చెబుతుంటారు. కానీ నేటి తరం నటీమణులు మాత్రం ఆ సమయాన్ని కెరీర్‌కు అడ్డంకిగా భావించట్లేదు. తమలోని మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే, వృత్తి పట్ల అంకితభావంతో షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. భారీ యాక్షన్ సీన్లు, లాంగ్ షెడ్యూల్స్ అని చూడకుండా వెండితెరపై తమ సత్తా చాటుతున్న ఈ అందాల భామల డెడికేషన్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మాతృత్వం కెరీర్‌కు ముగింపు కాదని వీరు నిరూపిస్తున్నారు. ఆ వివరాలు చూద్దాం..

దీపికా పదుకొణె - 'రాక ' షూటింగ్:

గ్లోబల్ స్టార్ దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ సమయంలోనే 'కల్కి 2898 AD' వంటి భారీ చిత్రంలో నటించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఆమె గర్భవతిగానే కనిపిస్తారు. రీల్ లైఫ్‌లోనూ, రియల్ లైఫ్‌లోనూ ఆ మాతృత్వాన్ని ఆమె ఎంతో హుందాగా మోశారు. ఇక త్వరలో అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో వస్తున్నా రాక మూవీలోను ప్రెగ్నెన్సీ సమయంలోనే పాల్గొననున్నారు.




 


అలియా భట్ - హాలీవుడ్ యాక్షన్:

అలియా భట్ తన గర్భధారణ సమయంలో ఏమాత్రం తగ్గలేదు. హాలీవుడ్ మూవీ 'హార్ట్ ఆఫ్ స్టోన్' షూటింగ్ సమయంలో ఆమె గర్భంతో ఉన్నారు. ఇక అయినప్పటికీ రిస్క్ ఉన్న యాక్షన్ సీన్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాగే 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' పాటల చిత్రీకరణ సమయంలోనూ ఆమె తన పని పట్ల ఉన్న నిబద్ధతను చాటుకున్నారు.




 


లావణ్య త్రిపాఠి - టాలీవుడ్ డెడికేషన్:

మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా ఈ లిస్టులో చేరారు. 'సతీ లీలావతి' సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె గర్భవతి. ఇక ముఖ్యంగా మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి, కానీ ఆమె షూటింగ్ పూర్తి చేసి తన ప్రొఫెషనలిజాన్ని నిరూపించుకున్నారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్ ప్రేక్షకులు ఆమెను అభినందిస్తున్నారు.




 


కాజోల్ మరియు కరీనా కపూర్:

సీనియర్ నటి కాజోల్ తన రెండో బిడ్డ సమయంలో 'వి ఆర్ ఫ్యామిలీ' షూటింగ్‌లో పాల్గొన్నారు. గతంలో చేదు అనుభవాలు ఉన్నా, టీమ్ సపోర్ట్‌తో ఆమె పట్టుదలతో పనిచేశారు. అలాగే కరీనా కపూర్ 'వీరే ది వెడ్డింగ్', 'లాల్ సింగ్ చద్దా' సినిమాల సమయంలో గర్భంతోనే షూటింగ్స్ పూర్తి చేసి బాలీవుడ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

యామీ గౌతమ్ మరియు నేహా ధూపియా: '

ఆర్టికల్ 370' షూటింగ్ సమయంలో యామీ గౌతమ్ తాను గర్భవతి అని తెలుసుకున్నారు. కానీ షూటింగ్ ఆపకుండా పూర్తి చేశారు. అలాగే నేహా ధూపియా 'ఏ థర్స్ డే' చిత్రంలో గర్భవతి అయిన పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఆమె పరిస్థితికి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి మరీ షూటింగ్ పూర్తి చేయడం విశేషం.

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే లేదా గర్భం దాల్చితే కెరీర్ ముగిసిపోయిందని భావించేవారు. కానీ ఈ తరం భామలు ఆ అపోహలను చెరిపేస్తున్నారు. మాతృత్వం అనేది ఒక అద్భుతమైన అనుభూతి మాత్రమే కాదు, అది తమ పనికి ఎప్పుడూ ఆటంకం కాదని వీరు నిరూపిస్తున్నారు. శారీరక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా వారు ప్రదర్శిస్తున్న ఈ అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం.

Tags:    

Similar News