టాలీవుడ్ బెస్ట్ డాన్స‌ర్స్ ఎవ‌రో చిరు తేల్చేశారు

Update: 2022-04-27 14:54 GMT
మెగాస్టార్ చిరంజీవి దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొర‌టాల శివ అత్యంత భారీ స్థాయిలో రూపొందించిన ఈ  చిత్రం ఎట్ట‌కేలకు ఏప్రిల్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.  చ‌ర‌ణ్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టించారు. త‌న‌కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టించింది. ఈ మూవీలో చిరుకు జోడీ లేద‌న్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌డు ఇదే మెగా అభిమానుల‌ని టెన్ష‌న్ పెడుతోంది.  

హీరోయిన్ లేకుండా చిరు ఇంత వ‌ర‌కు ఏ సినిమా చేయ‌లేదు. స‌డ‌న్ గా హీరోయిన్ లేక‌పోవ‌డంతో అభిమానులు `ఆచార్య‌`లో గెస్ట్ క్యారెక్ట‌ర్ చిరుదా?  లేక చ‌ర‌ణ్ దా? అని ఆరాతీస్తున్నార‌ట‌. ఇదిలా వుంటే ఈ మూవీ రిలీజ్ మ‌రో రెండు రోజులే వుండ‌టంతో మెగాస్టార్ చిరంజీవి, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ వ‌రుస ప్ర‌మోష‌న్స్ లో పాల్గొంటున్నారు. ఈ సంద‌ర్భంగా `ఆచార్య‌` టీమ్ తో స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ స్పెష‌ల్ చిట్ ఛాట్‌ని నిర్వ‌హించారు.

ఈ చిట్ చాట్ లో హ‌రీష్ శంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ప‌లు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పిన చిరు `ఆచార్య‌` సోల్ గురించి చెప్పుకొచ్చారు. చ‌ర‌ణ్‌, నేను క‌లిసి ఓ స‌న్నివేశంలో న‌టించామ‌ని, ఆ స‌మ‌యంలో అస‌లు సీన్ ఎలా వ‌చ్చింది? అనే విష‌యం సెట్ లో వున్న వాళ్లెవ‌రూ చెప్ప‌లేద‌ని, ఓకేనా లేక మ‌రో టేక్ తీసుకోవాలో తెలియ‌క మేము టెన్ష‌న్ లో ప‌డ్డాం అని తెలిపారు. లంచ్ బ్రేక్ అని చెప్పినా ఎవ‌రూ క‌ద‌ల‌ట్లేదు మేమే టైం తీసుకుని ఎవ‌రూ క‌ద‌ల‌ట్లేదండీ అని కొర‌టాల‌కు చెప్పాం.

అప్పుడు మానిట‌ర్ లో సీన్ చూసిఅంద‌రూ క‌న్నీళ్లు తుడుచుకుంటూ అక్క‌డి నుంచి క‌దిలారు. చెర్రీ ఆ సీన్ లో లో గుండెల్పి పిండేసేలా న‌టించాడు. అదే సినిమాకు సోల్‌.. ఆ సీన్ క్లైమాక్స్ కు లీడ్‌. అదే సినిమాను నిల‌బెడుతుంది అంటూ కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు మెగాస్టార్. ఇద ఇదే సంద‌ర్భంగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన అంశాన్ని తేల్చేశారు. మీరిద్ద‌రూ కాకుండా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో బెస్ట్ డాన్స‌ర్స్ ఎవ‌ర‌ని హ‌రీష్ శంక‌ర్ చిరుని ప్ర‌శ్నించారు.

దీనికి చిరు ఆస‌క్తిక‌ర‌మైన స‌మాధానం చెప్పారు. ఇండ‌స్ట్రీలో చాలా మంది మంచి డాన్స‌ర్ లు వున్నార‌ని ముఖ్యంగా బ‌న్నీ, తార‌క్‌, రామ్ , నితిన్ చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. అయితే చిరు చెబుతుండ‌గానే మ‌ధ్య‌లో రామ్ చ‌ర‌ణ్ క‌ల్పించుకుని నా దృష్టిలో  తార‌క్, బ‌న్నీ బెస్ట్ డాన్స‌ర్స్ అని చెప్ప‌డం విశేషం. 
Tags:    

Similar News