• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీఎం కేసీఆర్ ను కలిసిన...

సీఎం కేసీఆర్ ను కలిసిన స్టార్ హీరో.. కథేంటి?

By - Tupaki Desk
Update: 2022-05-18 16:27 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ను తమిళ స్టార్ హీరో విజయ్ కలిశారు. హైదరాబాద్ వచ్చిన విజయ్.. ప్రగతి భవన్ లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. హీరో విజయ్ తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి  కూడా ఉన్నారు. వీరిని ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు  స్వయంగా సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హీరో విజయ్ ను సీఎం కేసీఆర్ శాలువతో సన్మానించారు.

ఈ సందర్భంగా హీరో విజయ్ ను సీఎం కేసీఆర్ శాలువాతో సన్మానించారు. విజయ్ ను కేసీఆర్  ఆప్యాయంగా పలకరించి సినిమా విశేషాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం హీరో విజయ్ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నారు. సినిమాను తమిళంతోపాటు తెలుగులో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యంలోనే హీరో విజయ్ హైదరాబాద్ వచ్చారు.

కాగా హీరో విజయ్ సినిమాలు తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలవుతున్నాయి. 'అదిరింది', 'విజిల్', తుపాకీ, మాస్టర్, బీస్ట్ సినిమాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. మంచి ఆదరణ పొందాయి. హీరో విజయ్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

కాగా స్టార్ హీరో విజయ్ తమిళనాట రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆయన తండ్రి పార్టీ స్థాపించినా కూడా ఆయన వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక తమిళ రాజకీయాల్లోనూ ఆయన అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను విజయ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే సినిమా షూటింగ్ కోసం వచ్చాడని.. అంతే తప్ప ఇందులో రాజకీయం లేదని కొందరు అంటున్నారు.
Tags:    
  • Vijay Thalapathy 
  • CM KCR 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS