మన రౌడీ ఏమైనా సముద్రపు దొంగనా?
పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ సిరీస్ సనిమాల గురించి తెలిసిందే. ఈ సినిమాల్లో హాలీవుడ్ దిగ్గజ నటుడు జానీ డెప్ జాక్ స్పారో పాత్ర లుక్ గుర్తుందా? అతడు పొడవాటి గిరజాల జుత్తు పిల్లి గడ్డంతో వింత వేషాలతో బోలెడంత అల్లరితో ఫన్ క్రియేట్ చేస్తుంటాడు. జాక్ స్పారోగా హాలీవుడ్ స్టార్ జానీ డప్ వేషాలకు ఆస్కార్ అవార్డులే దక్కాయి.
ఇదిగో ఇక్కడ రౌడీ కొండ లుక్ చూస్తుంటే ఆయననే గుర్తుకొస్తున్నాడు. బాగా ఏపుగా పెరిగిన ఆ గిరజాల జుత్తు.. ఆ ఫ్రెంచి గడ్డం చూస్తుంటే ఈయనేమైనా కరీబియన్ సముద్ర దొంగనా? తానేమైనా జాక్ స్పారో అనుకుంటున్నాడా? అంటూ తాజాగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ లాక్ డౌన్ సమయంలో విజయ్ దేవరకొండ కొత్త మేకోవర్ ట్రై చేశాడు. అతడి కొత్త గెటప్ యువతరంలో వైరల్ గా మారింది.
అయితే ఇదంతా ఆన్ సెట్స్ ఉన్న ఫైటర్ మూవీ కోసమా? అంటే కానే కాదు. తిరిగి అతడు ట్రిమ్ గా మారి పూరి మూవీ ఫైటర్ కోసం రెడీ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఈలోగానే ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేస్తూ రకరకాల ప్రయోగాలు చేస్తున్నట్టే కనిపిస్తోంది. ఇంతకీ ఆ పొడవాటి జుత్తు.. ఫ్రెంచి గడ్డం అతడికి సూటయ్యాయా? అంటే అభిమానుల నుంచి రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
కొందరైతే రౌడీని ఓ రేంజులోనే ట్రోల్ చేశారు. యూట్యూబ్ చానెల్ పబ్లిసిటీ కోసం వెర్రి ప్రకటనలు చేసే వివాదాస్పద కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ తో పోలుస్తూ పలువురు ఫన్నీ మీమ్ లను షేర్ చేశారు. మహమ్మారీ కారణంగా ఫైటర్ షూటింగ్ ఆగిపోవడంతో ఇలా సరదా వేషాలు వేస్తున్నాడు దేవరకొండ అని గ్రహించారంతా. ఫాదర్స్ డే సందర్భంగా ఈ ఫోటోని దేవరకొండ స్వయంగా షేర్ చేశాడు. ఇందులో తన తండ్రిగారు కూడా ఉన్నారు.