అతను వచ్చింది తారక్ కోసం కాదు

Update: 2018-05-31 06:06 GMT

రాజమౌళి తరువాత ఎన్టీఆర్ ఎక్కువగా ఎవరి సినిమాల్లో చేయాలనీ అనుకున్నాడో అందరికి తెలిసిందే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక్క అవకాశం వచ్చినా కూడా వదులుకోనని గతంలో చెప్పాడు. ఇక ఎట్టకేలకు అవకాశం రావడంతో షూటింగ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అసలే త్రివిక్రమ్ ప్రాసలు - పంచ్ డైలాగులు చాలా వాడతారు కాబట్టి తారక్ ఆ విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు. రీసెంట్ గా సినిమా టైటిల్ ను అరవింద సమేత అని ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో ఎక్కువగా ఉన్నందున ఆ తరహా బాష మీద పట్టుకోసం తారక్ చాలా కష్టపడుతున్నాడు అని గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వచ్చాయి. అదే విధంగా ఎన్టీఆర్ భాషను నేర్చుకోవడానికి ఒక ట్యూటర్ ని కూడా పెట్టుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే అందులో ఎలాంటి నిజం లేదని రీసెంట్ గా చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే ట్యూటర్ ని నియమించుకుంది ఎన్టీఆర్ కాదట. దర్శకుడు త్రివిక్రమట.

బాష మీద పట్టు ఉన్నా కూడా దర్శకుడు కొన్ని డైలాగులా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకోసం పంచాల్ దాస్ అనే ఒక రచయితను రాయలసీమ డైలాగుల కోసం నియమించుకున్నాడట. మొదట ఈ విషయం బయటకు రాగానే ఎన్టీఆర్ కోసమే తెప్పించారని అనుకున్నారు. కానీ తారక్ ఎలాంటి భాషలో అయినా డైలాగులు చెప్పగల సమర్ధుడు. ఇప్పటికే కొన్ని సీన్స్ లో అదరగొట్టారని మొన్నటి వరకు వచ్చిన వచ్చిన వార్తల్లో  ఎలాంటి నిజం లేదని చిత్ర వర్గాలు వెల్లడించాయి.      
Tags:    

Similar News