స్నేహ రుతు'పవనం' పవన్ -త్రివిక్రమ్

Update: 2016-05-03 04:26 GMT
అక్షరాలు నేర్చుకోవడం నుంచి జీవితం మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తు చేయడానికే.. తన సినిమాకి 'అ..ఆ' అని పేరు పెట్టానంటున్నాడు త్రివిక్రమ్. ఎప్పటికప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటూ మూలాలను వెతుకునే ప్రయత్నమే అ..ఆ. అన్న మాటల మాంత్రికుడు.. 'కొన్ని జ్ఞాపకాలను ఎఫ్పటికీ మరిచిపోలేమని.. కొన్ని ప్రయాణాలు ఎప్పటికీ ఆపాలని అనిపించదని, కొన్ని అనుభూతులను ఎంత పంచుకున్న సరిపోవాలని అనిపించదు' అన్నాడు.

'సిగరెట్ కాల్చుకుంటూ.. ఒక టీ కే డబ్బులుంటే దాన్ని వన్ బై టూ చేసుకుని తాగిన రోజులను గుర్తు చేసుకుంటూ.. నేను ఎప్పుడో రాసేసిన డైరీనే ఈ సినిమా. ఈ మూవీ కోసం నా వెనక బలంగా నిలబడ్డ వ్యక్తి నిర్మాత రాధాకృష్ణ. కథ ఉన్న సినిమా అని చేసినందుకు నితిన్ కి, అనసూయ రామలింగం పాత్రకు ప్రాణ ప్రతిష్ట చేసిన సమంతకు కృతజ్ఞతలు' అన్న త్రివిక్రమ్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తన స్నేహభావాన్ని తన మాటలంత పదునుగా చెప్పాడు.

'కొండ ఒకరికి తలొంచదు, శిఖరం ఒకరికి తలొంచి ఎరగదు, కెరటం అలిసిపోయి ఒకరి కోసం ఆగదు, తుఫాన్ ఎవరికి తలొంచి ఎరగదు, నాకిష్టమైన స్నేహితుడు, నా సునామీ నా ఉప్పెన, నేను దాచుకున్న నా సైన్యం.. నేను శత్రువు మీద చేసే యుద్ధం.. నేను ఎక్కుపెట్టిన బాణం, నా పిడికిట్లో వజ్రాయుధం, నా ఆశల ఆకాశంలో ఉన్న పిడుగు, ఎంతోమంది గుండెలు తడపడానికో వచ్చే ఒక చిన్న వర్షపు చినుకు.. స్నేహ రుతు పవనం పవన్ కళ్యాణ్.. వింటారా, వెనకాలే వస్తారా.. తోడుగా ఉందాం వస్తారా.. రండి విందాం' అని త్రివిక్రమ్ అనడంతో.. ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్నంటాయి. .
Tags:    

Similar News