#టాలీవుడ్ బాక్సాఫీస్ ఇక‌పైనా మెరిపించేది ఎంద‌రు?

Update: 2021-03-18 01:30 GMT
క్రాక్- ఉప్పెన- జాతిరత్నాలు మూడు చిత్రాలు ఒక‌దానికొక‌టి సంబంధం లేకుండా డిఫ‌రెంట్ జోన‌ర్ల‌లో వ‌చ్చి ఘ‌న‌విజ‌యాలు సాధించాయి. బ‌క్సాఫీస్ వ‌ద్ద నిర్మాత‌ల‌కు దండీగా లాభాలు తెచ్చిన చిత్రాలివి. మార్చి మిడిల్ నాటికి రిపోర్ట్ ఇది. ఈ వారం మ‌రో ఏడెనిమిది చిన్న సినిమాలు క్యూలో ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఇక వీటి రిజ‌ల్ట్ ఎలా ఉండ‌నుంది అన్న‌ది వేచి చూడాలి.

అయితే కార్తికేయ-జీఏ 2 కాంబినేష‌న్ మూవీ `చావు క‌బురు చ‌ల్ల‌గా` పై జ‌నాల్లో అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ సినిమా రిలీజ్ ముందే బిజినెస్ ప‌రంగా సేఫ్ జోన్ లో ఉంది. నాన్ థియేట్రిక‌ల్ రూపంలో చ‌క్క‌ని బిజినెస్ చేసింది. అలాగే నితిన్ రంగ్ దే చిత్రాన్ని 32 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తే థియేట్రిక‌ల్ నాన్ థియేట్రిక‌ల్ రూపంలో 36 కోట్లు తేగ‌లిగార‌న్న స‌మాచారం ఉంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్లు కొడ‌తాయ‌నే ట్రేడ్ న‌మ్ముతోంది.

ఆ త‌ర్వాత ప‌వ‌న్ న‌టించిన వ‌కీల్ సాబ్ టైమ్ వ‌స్తుంది. ఈ సినిమా దాదాపు 75కోట్ల మేర థియేట్రిక‌ల్ బిజినెస్ చేసింద‌ని నాన్ థియేట్రిల్ భారీగానే సాగుతోంద‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. నైజాం.. ఏపీలో భారీ ధ‌ర‌ల‌కు అమ్ముతున్నారు కాబ‌ట్టి రిట‌ర్నులు భారీగానే రాబ‌ట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాల‌తో పాటు సైలెంటుగా బ‌రిలోకొస్తున్న చిన్న సినిమాల్లో ఏవి హిట్ట‌వుతాయి? అన్న‌ది ఊహించ‌లేనిది.

క్రైసిస్ కొన‌సాగుతున్నా.. 2021 జ‌న‌వ‌రి బావుంది... ఫిబ్ర‌వ‌రిలో బంపర్ హిట్ తో ఉత్సాహం రెట్టింపైంది. మార్చిలోనూ మంచి విజ‌యం నిల‌బెట్టింది. ఏప్రిల్ ఆ త‌ర్వాత ఇదే హుషారు థియేట‌ర్ల‌లో కొన‌సాగాలంటే మంచి హిట్లు ప‌డాలి. జ‌నాల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే మంచి కంటెంట్ ఉన్న సినిమాల కోస‌మే వెయిటింగ్. ప్ర‌థ‌మార్థం ఆశావ‌హ ధృక్ప‌థాన్ని పెంచ‌డంతో సినిమాల చిత్రీక‌ర‌ణ‌లు ఊపందుకున్నాయి. 
Tags:    

Similar News