సీక్వెల్‌ కోసం పెన్ను పట్టిన సూపర్‌ స్టార్‌

Update: 2021-08-24 16:30 GMT
యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్ ఒక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా మరో వైపు సినిమాలు వరుసగా చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్‌ సినిమాను చేస్తున్నాడు. కమల్‌ తో పాటు ఆ సినిమాలో విజయ్‌ సేతుపతి మరియు ఫాహద్‌ ఫాజిల్ లు నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. పైగా లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం సౌత్‌ లోనే కాకుండా ఉత్తరాదిన కూడా మంచి పేరున్న దర్శకుడు. ఆ కారణంగా విక్రమ్‌ సినిమా కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి బిజినెస్ అవ్వడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వైపు విక్రమ్‌ చేస్తూనే మరో వైపు తమిళ సూపర్‌ హిట్‌ మూవీ తేవర్ మగన్ సినిమా కు సీక్వెల్‌ చేసే పనిలో కూడా కమల్‌ ఉన్నాడు.

కమల్‌ హాసన్‌ తేవర్ మగన్ చిత్ర సీక్వెల్ దర్శకత్వ బాధ్యతను మలయాళ దర్శకుడు మహేష్‌ నారాయణ్‌ కు అప్పగించాడు. విలక్షణమైన సినిమాలను తెరకెక్కిస్తున్న ఈ మలయాళ దర్శకుడు సీక్వెల్‌ కోసం స్క్రిప్ట్‌ వర్క్‌ చేస్తున్నాడు. కమల్‌ కథ మరియు స్క్రిప్ట్‌ లో కీలక ఇన్‌ పుట్స్ ఇస్తున్నాడని ఇద్దరు కలిసి సినిమా కోసం స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నారు అంటూ తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మల్టీ ట్యాలెంటెడ్‌ కమల్‌ హాసన్ గతంలో దర్శకత్వమే చేశాడు. కనుక స్క్రిప్ట్‌ వర్క్‌ ఆయనకు పెద్ద విషయం కాదు.

తేవర్ మగన్ సినిమా లో కమల్‌ మరియు శివాజీ గణేషన్ లు నటించారు. 1992 లో వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ రాబోతున్న నేపథ్యంలో కమల్‌ తో పాటు మరెవ్వరు నటిస్తారా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మలయాళ స్టార్ నటుడు... పాన్‌ ఇండియా క్రేజీ యాక్టర్‌ ఫాహద్ ఫాజిల్ తో కలిసి కమల్‌ ఈ సీక్వెల్‌ లో నటించబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరు కలిసి విక్రమ్‌ లో నటిస్తున్నారు. మరోసారి వెంటనే నటించేందుకు ఇద్దరు సిద్దం అవ్వడంతో అభిమానులకు పండుగే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో తేవర్ మగన్ సీక్వెల్‌ ప్రేక్షకుల ముందుకు వస్తుందనే నమ్మకంతో తమిళ సినీ అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News