'రాజాసాబ్' డీల్‌పై నిర్మాత‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తాజా స‌మాచారం మేర‌కు `రాజాసాబ్` ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ఆ మేర‌కు చిత్ర నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ రాజా సాబ్ ఓటీటీ డీల్‌పై వివ‌రాలందించారు.;

Update: 2025-12-21 05:30 GMT

సంక్రాంతి బ‌రిలో వ‌స్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం `రాజా సాబ్`. ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ హారర్ కామెడీ స‌రికొత్త ట్రెండ్ సృష్టిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే ట్రైల‌ర్ స‌హా ప్రచార కంటెంట్ మంచి బజ్‌ను సృష్టించింది. ఇటీవ‌లి కాలంలో స్త్రీ 2 త‌ర్వాత మ‌ళ్లీ హార‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో ఇదే భారీ చిత్రం.

ప్ర‌భాస్ లాంటి పాన్ ఇండియ‌న్ స్టార్ ఒక హార‌ర్ చిత్రంలో న‌టించ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో దీనిపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఇందులో రాజా సాబ్ గా ప్ర‌భాస్ న‌ట‌న‌ను చూడాల‌ని అభిమానులు ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. ట్రైల‌ర్ ప్ర‌కారం... త‌ల పండిన రాజా సాబ్ కి, యువ‌కుడైన‌ ప్ర‌భాస్ సాబ్ కి ఉన్న లింక్ ఏమిట‌న్న‌ది కూడా ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

తాజా స‌మాచారం మేర‌కు `రాజాసాబ్` ఓటీటీ డీల్ క్లోజ్ అయింది. ఆ మేర‌కు చిత్ర నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ రాజా సాబ్ ఓటీటీ డీల్‌పై వివ‌రాలందించారు. అయితే ఊహించిన దానికంటే తక్కువ మొత్తానికే డీల్ కుదిరిందని విశ్వ‌ప్ర‌సాద్ నిజాయితీగా అంగీకరించారు. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉంద‌ని విశ్వ ప్రసాద్ అన్నారు. ఊహించిన దానికంటే తక్కువ డబ్బు వచ్చినా సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేసారు.

ముఖ్యంగా సంక్రాంతి సెల‌వుల్లో విడుదల కావడం బాక్సాఫీస్ కి క‌లిసొస్తుంద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్నారు. రాజాసాబ్ థియేట్రిక‌ల్ గా భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుంద‌ని ధీమాను క‌న‌బ‌రిచారు. ప్రచార కార్యక్రమాలలో భాగంగా, 27 డిసెంబర్ 2025న చిత్ర బృందం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది.

ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, బోమన్ ఇరానీ, సంజయ్ దత్ తదిత‌రులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకంపై విశ్వ‌ప్ర‌సాద్ నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం జనవరి 9న పలు భాషల్లో విడుదల కానుంది. శ్ర‌ద్ధా క‌పూర్ - రాజ్ కుమార్ రావు న‌టించిన స్త్రీ 2 హార‌ర్ జాన‌ర్ లో సంచ‌ల‌న వ‌సూళ్ల‌ను సాధించిన సంగ‌తి తెలిసిందే. అయితే హిందీ బెల్ట్ లో ప్ర‌భాస్ కి ఉన్న గ్రిప్ దృష్ట్యా `రాజాసాబ్` ఆ స్థాయి వ‌సూళ్ల‌ను సాధిస్తుందా? అన్న‌ది వేచి చూడాలి.

Tags:    

Similar News