ఆది, సందీప్ ఫన్నీ 'హిందీ' మూమెంట్ తెలుసా?

అయితే ఇంటర్వ్యూలో ఆది సాయికుమార్, సందీప్ కిషన్.. సినిమాతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు.;

Update: 2025-12-21 04:35 GMT

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గురించి అందరికీ తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు శంబాల మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీతో త్వరలో థియేటర్స్ లో సందడి చేయనున్నారు.

క్రిస్మస్ ఫెస్టివల్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఆది ప్రమోషన్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తున్నారు. అందులో భాగంగా ఆది సాయి కుమార్ ను రీసెంట్ గా హీరో సందీప్ కిషన్ ఇంటర్వ్యూ చేశారు. అందులో సినిమాలో యాక్ట్ చేసిన నటి అర్చన అయ్యర్ కూడా పాల్గొన్నారు.

అయితే ఇంటర్వ్యూలో ఆది సాయికుమార్, సందీప్ కిషన్.. సినిమాతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నారు. అందుకు సంబంధించిన ఫుల్ వీడియో ఇప్పటికే నెట్టింట వైరల్ గా మారగా.. ఫన్నీగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇంటర్వ్యూలో భాగంగా.. ఆదితో సందీప్ కిషన్ కు ఉన్న ఫన్నీ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నారు.

తాను అప్పట్లో ఆదితో రెండు సార్లు హిందీ సినిమాకు వెళ్లానని సందీప్ కిషన్ తెలిపారు. జీవితంలో అంతటి వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొకటి లేదని నవ్వుతూ అన్నారు. మనోడికి ఒక ముక్క హిందీ కూడా అర్థం కాదని చెప్పుకొచ్చారు. అప్పుడే ఆది ఇన్వాల్వ్ అయ్యి.. ఇప్పుడు హిందీ అర్థమవుతుందని, అప్పట్లో అంతేనని తెలిపారు.

ఆ తర్వాత సినిమా చూస్తున్నంత సేపు కూడా ప్రతి డైలాగ్ కు తనవైపు తిరిగి ఆది క్వశ్చన్ చేశాడని చెప్పారు సందీప్ కిషన్. తాను అప్పుడు తనను సినిమా చూడనీయురా.. అంటూ అన్నానని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు హిందీ మూవీ చూడడం ఈజీ అయిపోయిందని ఆది తెలిపారు. సబ్ టైటిల్స్ వచ్చాయి కదా అని అన్నారు.

ఆ తర్వాత ఓసారి ఆది సాయికుమార్.. హిందీ మూవీ ఆడిషన్ కు వెళ్లిన విషయాన్ని సందీప్ కిషన్ ప్రస్తావించారు. ఆడిషన్ కు వెళ్లిన విషయాన్ని తనకు అప్పుడు ఆది కాల్ చేసి చెప్పాడని తెలిపారు. దీంతో సూపర్ రా అని చెప్పినట్లు గుర్తుచేశారు. హీరోగా ఆది కెరీర్ స్టార్ట్ చేసిన టైమ్ లో అది జరిగిందని అన్నారు. ధావత్ ఇష్క్ మూవీ అని చెప్పారు.

తెలుగును హిందీలో డబ్ చేస్తే ఎలా ఉందో.. అలాగే అప్పుడు మాట్లాడాడని నవ్వుతూ నవ్వుతూ చెప్పారు సందీప్ కిషన్. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్ని ప్లాట్ ఫామ్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. ఫన్నీ మూమెంట్ తెలుసుకుని సినీ ప్రియులు నవ్వుకుంటున్నారు.

Tags:    

Similar News