శంకర్, అయాన్ ముంచేశారు.. ఇప్పుడు ఆశలన్నీ వాళ్ళిద్దరి పైనే!
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, బాలీవుడ్ మీద పట్టు కోసం అక్కడి స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీని నమ్మి 'వార్ 2'లో అడుగుపెట్టారు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పెద్ద అడ్వాంటేజ్ అవుతుందనుకున్నారు.;
RRR సినిమాతో మన టాలీవుడ్ హీరోల రేంజ్ ఏ లెవెల్లో పెరిగిందో తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీంతో వీరి నుంచి వచ్చే తర్వాతి సినిమాలపై అంచనాలు పీక్స్ లో ఉండటం సహజం. 2024లో ఎన్టీఆర్ 'దేవర'తో పర్లేదు అనిపించుకున్నా, చరణ్ మాత్రం గ్యాప్ తీసుకున్నారు. ఇక 2025లో వీరిద్దరూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని, పాన్ ఇండియా లెవెల్ లో రికార్డులు బద్దలు కొడతారని ఫ్యాన్స్ గట్టిగా నమ్మారు. కానీ సీన్ కట్ చేస్తే, ఫలితం మాత్రం పూర్తి రివర్స్ అయ్యింది.
రామ్ చరణ్ ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేసి, ఇండియన్ సినిమా లెజెండ్ శంకర్ ను నమ్మి 'గేమ్ చేంజర్' చేశారు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. శంకర్ మార్క్ మ్యాజిక్ మిస్ అవ్వడం, కథలో పట్టు లేకపోవడంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మేకర్స్ కు భారీ నష్టాలు రావడమే కాకుండా, చరణ్ కెరీర్ లోని కీలకమైన సమయం ఈ ప్రాజెక్ట్ వల్ల వృధా అయ్యిందనే విమర్శలు వచ్చాయి.
ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, బాలీవుడ్ మీద పట్టు కోసం అక్కడి స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీని నమ్మి 'వార్ 2'లో అడుగుపెట్టారు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం పెద్ద అడ్వాంటేజ్ అవుతుందనుకున్నారు. కానీ ఆగస్టులో రిలీజ్ అయిన ఈ స్పై యాక్షనర్ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. కంటెంట్ వీక్ గా ఉండటంతో, ఇలాంటి బాలీవుడ్ సినిమాను ఎంచుకున్నందుకు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది.
దీన్ని బట్టి అర్థమవుతున్న విషయం ఏంటంటే.. 2025లో మన హీరోలిద్దరూ బ్రాండ్ నేమ్స్ ను నమ్మి మోసపోయారు. శంకర్, అయాన్ ముఖర్జీ లాంటి పెద్ద డైరెక్టర్లు తమను పాన్ ఇండియా లెవెల్ లో నిలబెడతారని ఆశపడ్డారు. కానీ ఆ దర్శకులు మన హీరోల మాస్ ఇమేజ్ ను, ఆడియెన్స్ పల్స్ ను పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఫలితంగా 2025 సంవత్సరం RRR స్టార్స్ కు ఒక పీడకలగా మిగిలిపోయింది.
కానీ ఇప్పుడు 2026పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఎందుకంటే ఈసారి మన హీరోలు పరాయి దర్శకులను కాకుండా, మన నేటివిటీ తెలిసిన లోకల్ టాలెంట్ ను నమ్ముకున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 'పెద్ది' అనే రూరల్ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నారు. ఉప్పెనతో తన సత్తా ఏంటో చూపించిన బుచ్చిబాబు, చరణ్ ను చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తారని టాక్. ఇది 2026 సమ్మర్ లో రాబోతోంది.
మరోవైపు ఎన్టీఆర్ కూడా తప్పు తెలుసుకుని మాస్ పల్స్ తెలిసిన ప్రశాంత్ నీల్ తో వస్తున్నాడు. వీరి కాంబోలో వస్తున్న 'డ్రాగన్' షూటింగ్ ఇప్పటికే మొదలైంది. నీల్ ఎలివేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సో, 2025లో స్టార్ డైరెక్టర్లు చేసిన డ్యామేజ్ ను, 2026లో మన యంగ్ డైరెక్టర్లు రిపేర్ చేస్తారని, అసలైన మాస్ జాతర చూపిస్తారని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.