మల్టీప్లెక్స్ మేనియా.. RTC క్రాస్ రోడ్స్ లో సీన్ మారుతోంది!

ఇప్పుడు ఈ ఏరియాలో ఆధునిక హంగులతో కూడిన కొత్త మల్టీప్లెక్స్ లు రావడంతో పాత కాలపు థియేటర్ల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.;

Update: 2026-02-05 09:51 GMT

హైదరాబాద్‌ లో సినిమా అంటే చాలు అందరికీ గుర్తొచ్చేది RTC క్రాస్ రోడ్స్. దశాబ్దాలుగా ఇక్కడి థియేటర్ల వద్ద ఫ్యాన్స్ చేసే హంగామా, కటౌట్లు, పటాసుల సందడి ఒక ఎత్తు. ఇక్కడి సింగిల్ స్క్రీన్స్ లో సినిమా చూడటం అంటే ఒక ఎమోషన్. కానీ కాలం మారుతున్న కొద్దీ ప్రేక్షకుల టేస్ట్ కూడా మారుతోంది. ఇప్పుడు ఈ ఏరియాలో ఆధునిక హంగులతో కూడిన కొత్త మల్టీప్లెక్స్ లు రావడంతో పాత కాలపు థియేటర్ల పరిస్థితి ఏంటనే చర్చ మొదలైంది.

టెక్నాలజీ మారుతున్న తరుణంలో ప్రేక్షకులు లగ్జరీ సీటింగ్, అదిరిపోయే సౌండ్ సిస్టమ్‌ ను కోరుకుంటున్నారు. ఒకప్పుడు సామాన్యుల సినిమా అడ్డాగా ఉన్న ఈ ప్లేస్ ఇప్పుడు కొత్త హంగులు దిద్దుకుంటోంది. ఈ మార్పు సినీ ప్రేమికులకు కొత్త ఎక్స్‌ పీరియన్స్ ఇస్తున్నా, పాత జ్ఞాపకాలు ఉన్న థియేటర్ల భవిష్యత్తుపై మాత్రం సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఒక క్రేజీ అప్‌ డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌ గా మారింది.

అసలు విషయం ఏంటంటే.. RTC క్రాస్ రోడ్స్ లోని చిక్కడపల్లి ఓడియన్ మాల్‌ లో ఇప్పుడు INOX మల్టీప్లెక్స్ ప్రారంభమైంది. ఏకంగా 8 కొత్త స్క్రీన్స్ అందుబాటులోకి రావడంతో సినిమా చూసే స్టైల్ కంప్లీట్ గా మారిపోనుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా, త్వరలోనే ఇక్కడ AMB మల్టీప్లెక్స్ కూడా రాబోతోందని టాక్ వినిపిస్తోంది. దీనివల్ల ఒకప్పుడు సింగిల్ స్క్రీన్స్ కు కేరాఫ్ అడ్రస్‌ గా ఉన్న ఈ ఏరియా ఇప్పుడు మల్టీప్లెక్స్ హబ్‌ గా మారుతోంది.

ఈ కొత్త మల్టీప్లెక్స్ లో 4K ప్రొజెక్షన్, డాల్బీ అట్మాస్ సౌండ్ లాంటి వరల్డ్ క్లాస్ ఫీచర్స్ ఉన్నాయి. సెలిబ్రిటీ రిక్లైనర్స్ తో పాటు సినిమా ఫుడ్ కోర్ట్ కాన్సెప్ట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇన్ని అత్యాధునిక సదుపాయాలు పక్కనే అందుబాటులోకి వస్తే సామాన్య ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్స్ వైపు ఎంతవరకు మొగ్గు చూపుతారనేది ఒక పెద్ద ప్రశ్న. దీంతో సంద్యా, సుదర్శన్ లాంటి పాత థియేటర్ల మనుగడ కష్టమేనా అనే భయం ఫ్యాన్స్ లో ఉంది.

మల్టీప్లెక్స్ ల హవా పెరిగితే సహజంగానే టికెట్ రేట్లు కూడా భారమవుతాయి. కానీ కంఫర్ట్ కోసం జనాలు ఇప్పుడు ఖర్చు చేయడానికి వెనకాడటం లేదు. సింగిల్ స్క్రీన్స్ కనుమరుగైతే ఒకప్పటి మాస్ ఎంటర్‌ టైన్‌ మెంట్ లోని ఆ కిక్కే మిస్ అవుతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఒక్కొక్కటిగా పాత థియేటర్లు మూతపడుతూ షాపింగ్ మాల్స్ గా మారుతున్న తరుణంలో, RTC క్రాస్ రోడ్స్ లోని సింగిల్ స్క్రీన్స్ ఈ పోటీని ఎలా తట్టుకుంటాయో చూడాలి. ఇక ట్రెండ్‌ కు తగ్గట్టుగా కొత్త స్క్రీన్స్ రావడం మంచిదే అయినా, సింగిల్ స్క్రీన్స్ లోని ఆ లోకల్ వైబ్ ను మాత్రం అవి భర్తీ చేయలేవు. ఒకవైపు ఇనాగ్యురల్ ఆఫర్లతో ఐనాక్స్ సందడి చేస్తోంది. మరి ఈ కొత్త మల్టీప్లెక్స్ ల రాకతో ఈ ఏరియా సినిమా బిజినెస్ రూపురేఖలు ఎలా మారతాయో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News