'ధురంధర్ 2' OTT.. అసలు సంగతి ఇదేనా?
దీంతో ఫుల్ జోష్ లో ఉన్న ధురంధర్ మేకర్స్.. ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ ధురంధర్-2ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.;
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ లీడ్ రోల్ లో నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ ధురంధర్ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి అనేక రికార్డులు బ్రేక్ చేసింది. ఎన్నో కొత్తవి కూడా క్రియేట్ చేసింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ధురంధర్ మూవీ సందడి చేస్తోంది. పెద్ద సంఖ్యలో వ్యూస్ సంపాదించుకుంటోంది.
దీంతో ఫుల్ జోష్ లో ఉన్న ధురంధర్ మేకర్స్.. ఇప్పుడు ధురంధర్ సీక్వెల్ ధురంధర్-2ను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఫస్ట్ పార్ట్ ను కేవలం హిందీలోనే విడుదల చేయగా.. ఇప్పుడు మాత్రం వివిధ భాషల్లో తీసుకొస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ను రిలీజ్ చేసిన సమయంలో ఆ విషయాన్ని వెల్లడించారు. అదే సమయంలో ఓటీటీ పార్టనర్ పై కూడా క్లారిటీ ఇచ్చారు.
ధురంధర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుండగా.. సీక్వెల్ రైట్స్ మాత్రం మరో ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. దీంతో ఆ విషయం హాట్ టాపిక్ గా మారింది. సీక్వెల్ కు ఓటీటీ పార్టనర్ ఎందుకు మారిందోనని అంతా మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా పార్ట్ 1 ఎక్కడైతే స్ట్రీమింగ్ అవుతుందో సీక్వెల్ కూడా దాదాపు అదే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వస్తుంది.
కానీ, ధురంధర్ 2 విషయంలో మాత్రం భిన్నంగా జరగడంతో డిస్కస్ చేసుకుంటున్నారు. అందుకు కారణాల కోసం కూడా మాట్లాడుకుంటున్నారు. నిజానికి.. ధురంధర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో జియో హాట్ స్టార్.. మేకర్స్ కు పెద్ద మొత్తంలో ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అందుకే ఆ సంస్థ చేతికి ఓటీటీ రైట్స్ వెళ్లినట్లు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. అలా భారీ డీల్, మార్కెటింగ్ స్ట్రాటజీ వంటి కారణాల వల్ల ఓటీటీ పార్టనర్ మార్పు జరిగి ఉండొచ్చని సమాచారం. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ మూవీకి సీక్వెల్ కు ఓటీటీ పార్టనర్ మార్పుకు ఇదా అసలు సంగతి అని నెటిజన్లు చెబుతున్నారు. ఏదేమైనా సినిమా కోసం తాము ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. రణవీర్ సింగ్ తో పాటు అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. మొదటి భాగం కంటే ఈసారి సీక్వెల్ స్టోరీ థ్రిల్లింగ్ గా, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సులు హాలీవుడ్ స్థాయిలో ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ వచ్చిన అతి తక్కువ రోజుల్లో సీక్వెల్ రిలీజ్ కావడం మాత్రం విశేషమే. మరి మార్చి 19వ తేదీన రిలీజ్ కానున్న ధురంధర్ 2 మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.