పెద్ది నైజాం లెక్కలు.. బేరసారాలు మామూలుగా లేవుగా!

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెక్స్ట్ గట్టిగా హడావుడి చేయబోయే సినిమాల్లో పెద్ది ఒకటి.;

Update: 2026-02-05 09:52 GMT

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెక్స్ట్ గట్టిగా హడావుడి చేయబోయే సినిమాల్లో పెద్ది ఒకటి. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా బిజినెస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏరియాలో రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కుల కోసం పోటీ పడుతున్నారు.

​సాధారణంగా ఒక పెద్ద సినిమా వస్తుందంటే నైజాం మార్కెట్ రేంజ్ వేరుగా ఉంటుంది. ఇక్కడ వసూళ్లు బాగుంటే సినిమా సగం సక్సెస్ అయినట్లే అని మేకర్స్ నమ్ముతారు. అందుకే ఈ ఏరియా హక్కులను దక్కించుకోవడానికి బడా డిస్ట్రిబ్యూటర్లు రంగంలోకి దిగారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకం, చరణ్ గ్లోబల్ ఇమేజ్ తోడవ్వడంతో బిజినెస్ డీల్స్ పీక్స్‌కు చేరుతున్నాయి. ఈ క్రమంలోనే రేట్ల విషయంలో ఒక క్రేజీ టాక్ బయటకు వచ్చింది.

​పెద్ది నైజాం హక్కుల కోసం మేకర్స్ ఏకంగా 60 నుండి 65 కోట్లు కోట్ చేస్తున్నారట. ఒక రీజనల్ సినిమాకు ఈ రేంజ్ రేటు అంటే అది మామూలు విషయం కాదు. చరణ్ కెరీర్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటంతో, బిజినెస్ కూడా అదే స్థాయిలో ఉండాలని ఫిక్స్ అయ్యారు.

​అయితే డిస్ట్రిబ్యూటర్ల సైడ్ నుండి కూడా గట్టిగానే బేరాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికి 50 కోట్ల వరకు రేట్లు కోట్ చేస్తూ బేరాలు రెడీగా ఉన్నాయని టాక్. అంటే మేకర్స్ అడిగే రేటుకు, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే రేటుకు మధ్య సుమారు 10 నుండి 15 కోట్ల గ్యాప్ ఉంది. చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా కావడంతో రిస్క్ చేయడానికి చాలామంది సిద్ధంగా ఉన్నా, సేఫ్ గేమ్ కోసం రేట్లు తగ్గించాలని చూస్తున్నారు.

​నైజాం ఏరియాలో థియేటర్ల లెక్కలు, టికెట్ రేట్లు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ బేరసారాలు సాగుతున్నాయి. దిల్ రాజు వంటి బడా పంపిణీదారులు ఈ రేసులో ఉన్నారా లేదా అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఒకవేళ 60 కోట్లకు డీల్ గనుక క్లోజ్ అయితే, నైజాం బాక్సాఫీస్ వద్ద పెద్ది సినిమా బలమైన ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఈ డీల్ ఎంతకు సెటిల్ అవుతుందోనని ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 'పెద్ది' నైజాం లెక్కలు తేలడానికి మరికొంత టైమ్ పట్టేలా ఉంది. చరణ్ మాస్ పవర్ మీద నమ్మకంతో మేకర్స్ తగ్గేదే లే అంటున్నారు. త్వరలోనే ఈ హక్కులు ఎవరికి దక్కుతాయో అనే విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సమ్మర్ బరిలో దిగుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News