సందిగ్ధంలో బుచ్చిబాబు.. ఆ ఎఫెక్ట్ పడనుందా?

కారణం సంక్రాంతి సినిమాల హడావిడి.. ముఖ్యంగా చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతోపాటు ప్రభాస్ రాజా సాబ్ చిత్రాలపైన అంచనాలు భారీగా నెలకొన్నాయి.;

Update: 2025-12-21 06:14 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సుకుమార్ తాను ఎంత ఎత్తుకైతే ఎదిగారో.. తన దగ్గర శిష్యరికం పుచ్చుకున్న వారికి కూడా అంతే స్థాయిని కల్పిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే సుకుమార్ శిష్యుడిగా పేరు సొంతం చేసుకున్న బుచ్చి బాబు సనా ఉప్పెన సినిమాతో తొలి ప్రయత్నం చేసి.. 100 కోట్ల క్లబ్లో చేరి సక్సెస్ సాధించారు. కృతి శెట్టి హీరోయిన్ గా, మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఈ సినిమా ద్వారానే ఇండస్ట్రీకి పరిచయమై.. మొదటి ఎంట్రీతోనే భారీ సక్సెస్ ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు బుచ్చి బాబు సనా ఏకంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో పెద్ది సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

విడుదలకు కేవలం మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సినిమా షూటింగ్ వేగంగా పూర్తి చేసే పనిలో పడ్డ బుచ్చిబాబు.. ఇప్పుడు సందిగ్ధంలో పడ్డారు అని చెప్పవచ్చు. దీనికి కారణం సంక్రాంతి సినిమాలే అనే వార్త వినిపిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల ఈ సినిమా నుండి "చికిరి చికిరి" అనే పాటను విడుదల చేశారు. ఈ పాట వచ్చి 50 రోజులైనా ఒక్క తెలుగు వెర్షనే వంద మిలియన్ల వ్యూస్ దాటేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఏ ఆర్ రెహమాన్ అందించిన కంపోజింగ్ మరింతగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాట ఏ రేంజ్ లో అయితే సక్సెస్ అయిందో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పాట కోసం కూడా అభిమానులు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం పెద్ది టైటిల్ సాంగ్ అయిన "మస్సా మస్సా"ని కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయాలని అనుకున్నారట. అందుకు తగ్గట్టుగానే ఎడిట్ చేసి సిద్ధంగా కూడా ఉంచారట. అయితే ఇప్పుడు ఆ పాటను విడుదల చేయాలా లేదా అనే సందిగ్ధంలో పడ్డారు బుచ్చిబాబు

కారణం సంక్రాంతి సినిమాల హడావిడి.. ముఖ్యంగా చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు చిత్రంతోపాటు ప్రభాస్ రాజా సాబ్ చిత్రాలపైన అంచనాలు భారీగా నెలకొన్నాయి. అలాగే యంగ్ హీరోలు కూడా చాలామంది తమ సినిమాలను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు ఈ నెల 27న ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఈవెంట్ కూడా ఉంటుంది. కొత్త ట్రైలర్ ను లాంచ్ చేస్తారు. ఇక అలాగే నెలాఖరులో చిరంజీవి, వెంకటేష్ కాంబోలో మన శంకర వరప్రసాద్ గారు సినిమా నుంచి పాటను విడుదల చేస్తున్నారు. ఇవే కాకుండా సంక్రాంతి సినిమాలకు సంబంధించి రోజుకు ఒక అప్డేట్ వస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో పెద్ది టైటిల్ సాంగ్ ను విడుదల చేస్తే అసలు వర్క్ అవుట్ అవుతుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ పాటను ఇప్పుడు విడుదల చేస్తే మిగిలిన వాళ్ళకి కూడా లేనిపోని ఇబ్బంది సృష్టించడం తప్ప మరొక లాభం ఉండదని బుచ్చిబాబు ఆలోచన చేస్తున్నారట. అటు మార్చి 27న సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. కేవలం మూడు నెలలు మాత్రమే టైముంది కాబట్టి బ్యాలెన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా వేగవంతం చేయాల్సి ఉంటుంది. అటు హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేసుకొని ఢిల్లీకి వెళ్తున్న రామ్ చరణ్ అక్కడ క్లైమాక్స్ ముగించుకొని వచ్చేస్తారు. దీంతో ప్రధాన ఘట్టాలు అయిపోయినా.. ఐటమ్ సాంగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు హీరోయిన్ ని కూడా లాక్ చేసి ఫిబ్రవరిలో దాన్ని చిత్రీకరించాలి. ఇలా ఇంకా ఎన్ని పనులు ఉన్నాయో.. కాబట్టి ఇవన్నీ బుచ్చి బాబుకి మరింత ఒత్తిడిని పెంచుతున్నాయని చెప్పవచ్చు.

Tags:    

Similar News