వ‌రుస ప్లాప్ ల‌కు బ్రేక్ వేసిన ఒకే ఒక్క‌డు!

ర‌వితేజ‌, నితిన్, వ‌రుణ్ తేజ్, రామ్, గోపీచంద్, శ‌ర్వానంద్ లాంటి స్టార్ హీరోల రిలీజ్ లైన‌ప్ చూస్తే దిమ్మ తిరిగి పోతుంది.;

Update: 2026-02-04 19:30 GMT

టాలీవుడ్ లో సక్సెస్ రేట్ దారుణంగా ప‌డిపోయింద‌న్న‌ది కాద‌న‌లేని నిజం. స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలంటూ రెండేళ్ల‌కు..మూడేళ్ల‌కు ఒక్కో రిలీజ్ తో రావ‌డంతో? బాక్సాఫీస్ వ‌ద్ద గ‌ణాంకాలు పూర్తిగా ప్ర‌తికూలంగా మారిపోయాయి. గ్రాఫ్ ఎంత వేగంగా మెరుగు ప‌డుతుందో? అంతే వేగంగానూ డ్రాప్ అవుతోంది. అందుకు ప్ర‌త్య‌క్ష ప‌రోక్షంగా టైర్ -2, టైర్ -3 హీరోలు కూడా కార‌కులుగా మారుతున్నారు. వాళ్లు న‌టించిన సినిమాలేవి ఆశించిన ఫ‌లితాలు సాధిం చ‌క‌పోవ‌డమే మ‌రో కార‌ణంగా చెప్పొచ్చు. ఓసారి ఆ హీరోల జాబితా చూస్తే విష‌యం క్లియ‌ర్ గా అర్ద‌మ‌వుతుంది.

ర‌వితేజ‌, నితిన్, వ‌రుణ్ తేజ్, రామ్, గోపీచంద్, శ‌ర్వానంద్ లాంటి స్టార్ హీరోల రిలీజ్ లైన‌ప్ చూస్తే దిమ్మ తిరిగి పోతుంది. వీటిలో విజ‌యాలు ఎక్క‌డా? అని భూతద్దం పెట్టి వెతికినా దొర‌క‌వేమో. `ధ‌మాకా` విజ‌యం త‌ర్వాత ర‌వితేజ ఆరు సినిమాల్లో న‌టించాడు. వాటిలో ఏ చిత్రం కూడా ఆశించిన ఫ‌లితాన్ని సాధిం చ‌లేదు. చివ‌రికి ఈ మ‌ధ్య‌నే `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి`తో ఫ్యామిలీ జాన‌ర్లోకి వ‌చ్చినా ఫ‌లితం ఆశించిన విధంగా రాలేదు. అలాగే మెగా వార‌సుడు వ‌రుణ్ తేజ్ కి `ఎఫ్ 3` త‌ర్వాత విజ‌యం అంద‌ని ద్రాక్ష‌గా మారింది. ఆ త‌ర్వాత న‌టించిన మూడు సినిమాలు డిజాస్ట‌ర్ అయ్యాయి.

అలాగే మ్యాచో స్టార్ గోపీచంద్ ప‌రిస్థితి అంత‌కు మించి దారుణంగా ఉంది. `గౌత‌మ్ నందా` త‌ర్వాత తొమ్మిది సినిమాలు చేసాడు. వీటిలో `ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్` బిలో యావ‌రేజ్ గా ఆడింది మిన‌హా చిత్రాల‌న్నీ డిజాస్ట‌ర్లే. చెప్పుకొవ‌డానికి సంఖ్య త‌ప్ప అంత‌కు మించి సాధించింది ఏం లేదు. అలాగే యూత్ స్టార్ నితిన్ `భీష్మ` త‌ర్వాత ఏడు సినిమాల్లో న‌టించాడు. అవ‌న్నీ కూడా ప్లాప్ అయిన‌వే. క‌నీసం యావ‌రేజ్ హిట్ లో ఒక‌టీ లేదు. అల్ల‌రి న‌రేష్ విజ‌యం కోసం పోరాట‌మే చేస్తున్నాడు. కామెడీ జాన‌ర్ వ‌దిలేసిన త‌ర్వాత చాలా ర‌కాల జాన‌ర్లు ట్రై చేసాడు.

వీటిలో సీరియ‌స్ యాక్ష‌న్ చిత్రాలు కూడా ఉన్నాయి. వాటితో రిజ‌ల్ట్ పాజిటివ్ గా వ‌చ్చిందా? అంటే ఎక్క‌డా ఆ ర‌కంగా క‌నిపించ‌లేదు. మ‌రో రెండేళ్ల త‌ర్వాత న‌రేష్ కొత్త జాన‌ర్ లోకి వెళ్తాడేమో చూడాలి. అలాగే నంద‌మూరి వార‌సుడు క‌ల్యాణ్ రామ్ `బింబిసార` త‌ర్వాత విజ‌యం కోసం చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. `అమిగోస్` తో మ‌రో డిఫ‌రెంట్ అటెంప్ట్ చేసాడు కానీ ప‌న‌వ్వ‌లేదు. ఆ త‌ర్వ‌త న‌టించిన రెండు సినిమాలతో మ‌ళ్లీ పాత రూట్లోకి వెళ్లిపోతున్నాడా? అన్న సందేహం క‌లిగింది. మొన్న‌టి వ‌ర‌కూ శ‌ర్వానంద్ కూడా వీరి జాబితాలోనే హీరోనే.

అయితే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయిన `నారీ నారీ న‌డుమ మురారీ` విజ‌యంతో ఆ జాబితా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసాడు. ఈ సినిమా డీసెంట్ హిట్ అందుకుంది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు దక్కించుకుంది. ఇలా వ‌రుస ప్లాప్ ల నుంచి బ‌య‌ట ప‌డిన ఒకే ఒక్క స్టార్ గా శ‌ర్వాని చెప్పొచ్చు. అప్ క‌మింగ్ రిలీజ్ ల‌పైనా యంగ్ హీరో రెట్టించిన న‌మ్మ కంతో ఉన్నాడు.

Tags:    

Similar News