అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?
| అక్కినేని హీరోలు అంటేనే అందం, స్టైల్‌కు ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోలు అనేది మనకు తెలిసిన విషయమే.
అక్కినేని హీరోలు అంటేనే అందం, స్టైల్‌కు ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోలు అనేది మనకు తెలిసిన విషయమే. అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అక్కినేని వరకు అందరికీ అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా అక్కినేని హీరోల లుక్స్‌కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
అయితే అక్కినేని హీరోలకు నచ్చిన హీరోయిన్లు ఎవరు.. వారికి ఎవరిపైనైనా క్రష్ ఉందా..అనే ప్రశ్నలు అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తుంటాయి. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని గతంలో పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తన క్రష్ గురించి చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అఖిల్‌ను మీకు ఎవరైనా క్రష్ ఉన్నారా అని అడిగారు. దీనికి అఖిల్ మొదట తనకు ఎవరూ క్రష్ లేరని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ప్రస్తుతం హీరోయిన్లలో మీకు ఎవరంటే చాలా ఇష్టం అని అడిగినా, అలాంటివారు ఎవరూ లేరని చెప్పారు.
దీంతో యాంకర్ మరో ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ హీరోయిన్‌పై క్రష్ లేదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అఖిల్ కాసేపు ఆలోచించి తనకు దీపికా పడకోణెపై క్రష్ ఉండేదని చెప్పారు.
అఖిల్ చెప్పిన పేరు విని యాంకర్ కూడా ఆసక్తికరంగా స్పందించారు. చాలామంది దీపికా పడుకోణె పేరే చెబుతారని, అఖిల్ కజిన్ సుశాంత్ కూడా ఇదే పేరు చెప్పారని అన్నారు. దీంతో అఖిల్ ఆశ్చర్యంగా స్పందిస్తూ, సుశాంత్ కూడా దీపికా పేరే చెప్పారా అని అడిగారు.
ఇప్పుడు ఈ పాత ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిల్ తన క్రష్ గురించి చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మొత్తం పైన అఖిల్ అక్కినేని మనసు దోచిన హీరోయిన్ బాలీవుడ్ అందాల తార దీపికా పడుకోణె కావడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియోను చూసిన అభిమానులు అఖిల్ చెప్పిన సమాధానంపై సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మధ్యనే అఖిల్ అక్కినేని లెనిన్ చిత్రంతో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే.