సూపర్ హిట్ మూవీకి 16 ఏళ్ల తర్వాత సీక్వెల్‌

Update: 2021-11-29 23:30 GMT
ఈమద్య కాలంలో హిట్ సినిమాలకు వెంటనే సీక్వెల్స్ చేస్తున్నారు. సక్సెస్ అయిన సినిమాను మళ్లీ తీసుకు వస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే ఫార్ములా ఒకటి ఉంది. అందుకే సూపర్‌ హిట్‌ అయిన ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ లేదా అదే కాంబో సినిమాలు రావడం జరిగింది. ఇప్పుడు బాలీవుడ్ లో 16 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమాకు సీక్వెల్‌ చేసేందుకు సిద్దం అయ్యారు. అదే నో ఎంట్రీ... సల్మాన్ ఖాన్‌.. అనీల్‌ కపూర్ లు హీరోలుగా బిపాస బసు మరియు లారా దత్తాలు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా కు సీక్వెల్‌ ను ప్లాన్‌ చేశారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సీక్వెల్ గురించి చర్చ జరుగుతోంది. మేకర్స్ అప్పట్లోనే సీక్వెల్‌ తీయబోతున్నట్లుగా చెప్పారు. కాని కొన్ని కారణాల వల్ల సీక్వెల్‌ ఆలస్యం అవుతూ వచ్చింది.

ఎట్టకేలకు సీక్వెల్‌ కు సంబంధించిన మొదటి అడుగు పడింది. ఇప్పటికే స్క్రీప్ట్‌ వర్క్ పూర్తి అయ్యిందని సమాచారం అందుతోంది. ఈ సీక్వెల్‌ లో సల్మాన్‌ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. సల్మాన్‌ ట్రిపుల్‌ రోల్‌ అవ్వడంతో ఆయనకు జోడీగా ముగ్గురు హీరోయిన్స్‌ నటించబోతున్నారట. ఇంకా అనీల్ కపూర్‌ మరో హీరోకు జోడీగా కూడా ముద్దుగుమ్మలు నటించబోతున్నారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోలు మరియు 9 మంది హీరోయిన్స్ ఉండబోతున్నారు. అప్పట్లో నటించిన హీరోయిన్స్ ను కంటిన్యూ చేస్తూ కొత్త హీరోయిన్స్ ను కూడా సినిమాలో చూపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి నో ఎంట్రీ సినిమా సీక్వెల్‌ అడుగులు వడి వడిగా పడుతున్నాయి. ఈ సీక్వెల్‌ కు నో ఎంట్రీ మెయిన్‌ ఎంట్రీ అనే టైటిల్ ను కన్ఫర్మ్‌ చేశారు.

ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌ సాగే నో ఎంట్రీ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కామెడీ సినిమాలకు ఒక మార్గ దర్శకంగా నిలిచింది అనడంలో సందేహం లేదు. సల్మాన్‌ ఖాన్‌ మరియు అనీల్ కపూర్ ల మద్య సాగే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమా ఉంటుంది. ఇప్పుడు ఆ ఫ్లేవర్‌ ను కంటిన్యూ చేస్తూ అదే తరహా లో కామెడీ పంచుతూ ఆకట్టుకునే కామెడీని సినిమాలో జొప్పిస్తూ 9 మంది అందగత్తెల అందాలను సినిమాలో చూపిస్తూ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా సినిమాను తీయబోతున్నట్లుగా మేకర్స్‌ చెబుతున్నారు. ఒరిజినల్‌ వర్షన్‌ కు దర్శకత్వం వహించిన అనీస్ బజ్మీ నే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. ఇక బోణీ కపూర్‌ నో ఎంట్రీని నిర్మించగా సీక్వెల్‌ ను మాత్రం ఆయన నిర్మించడం లేదని తెలుస్తోంది.
Tags:    

Similar News