దర్శకుడిగా తేజ కు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం వుంది. ఆయన డైరెక్ట్ చేసిన చిత్రాలు చాలా వరకు బ్లాక్ బస్టర్ గా నిలిచి ఎంతో మందికి లైఫ్ ఇచ్చాయి. ఎంతో మంది టాలెంటెట్ యాక్టర్స్ ని తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అందులో చాలా మంది టెక్నీషియన్ లతో పాటు పాపులర్ అయిన హీరోలు కూడా వున్నారు.
అయితే ఎంతో మందికి అవకాశాలిచ్చి దర్శకులుగా, హీరోలుగా నిలబెట్టిన మూవీ మొఘల్ డా. డి. రామానాయుడు కుటుంబం నుంచి దగ్గుబాటి ఫ్యామిలీ వారసుడిని, స్టార్ ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు చిన్న కుమారుడు, హీరో రానా సోదరుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేసే బాధ్యతల్ని తేజ తీసుకున్నారు.
గత కొంత కాలంగా సైలెంట్ గా తమ పని తాము చేసుకుపోతున్నారు. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై జెమిని కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీ టైటిల్, ప్రీలుక్ ని మంగళవారం దర్శకుడు తేజ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి `అమింస` అనే టౌటిల్ ని ఫైనల్ చేశారు. అభిరామ్ ముఖం కనిపించకుండా కళ్లవరకు ఓ బస్తా సంచితో కట్టేయగా బ్లడ్ కారుతున్న స్టిల్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
సైలెంట్ గా సినిమాని ప్రారంభించేసి ఎవరికి తెలియకుండానే పూర్తి చేసేశారు. `అహింస` అంటూనే ప్రీ లుక్ లో హింసిని చూపిస్తున్న తీరు .. తేజ మళ్లీ తన పాత సక్సెస్ ఫుల్ పంథాలోనే ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. `అహింస` అంటూ ఈ మూవీకి టైటిల్ ని ఎంచుకున్న తీరు కూడా `నిజం` మూవీని గుర్తుచేస్తోంది. సినిమా అంతా యాక్షన్ సన్నివేశాలతో సరికొత్త పాయింట్ ని చర్చిస్తూ సాగుతుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే ఈ మూవీకి ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించడం.
గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద మ్యూజికల్ హిట్స్ గా నిలిచి యూత్ ని ఉర్రూతలూగించాయి. మళ్లీ ఇన్నాళ్లు ఆ క్రేజీ కాంబినేషన్ లో `అహింస` తెరపైకి వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత చిత్రాల తరహాలోనే తేజ - ఆర్పీ జోడీ మళ్లీ మ్యాజిక్ ని రిపీట్ చేయడం ఖాయం అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈమూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.
త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రీలుక్ పోస్టర్ తో పాటు షూటింగ్ డిటైల్స్ ని ప్రకటించిన చిత్ర బృందం ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. ఈ చిత్రానికి కెమెరా సమీర్ రెడ్డి - ఎడిటింగ్ కోటగిరి వెంకటేశ్వరరావు - స్టంట్స్ రియల్ సతీష్ - పాటలు చంద్రబోస్.