దివంగత నిర్మాత రామానాయుడు ముద్దుల మనవడు..సురేష్ బాబు తనయుడు అభిరామ్ ని హీరోగా పరిచయం చేస్తూ తేజ 'అహింస' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో మందిని స్టార్లగా మార్చిన తేజపై నమ్మకంతో అభిరామ్ ని తేజ చేతుల్లో పెట్టారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాల్ని బట్టి అహింస తేజ మార్క్ ఎంటర్ టైనర్ అని తెలుస్తుంది.
యువతరం మెచ్చే ప్రేమ కథతో అభిరామ్ ని పరిచయం చేస్తున్నారు. టైటిల్ ని బట్టి అహింసతో కూడిన ప్రేమ కథలా కనిపిస్తుంది. మరి టైటిల్ కి కాంట్రాస్ట్ గా హింసతో కూడిన ప్రేమ కథా? అహింసతో కూడిన ప్రేమాయణమా? అన్నది రిలీజ్ తర్వాత డిసైడ్ అవుతంది. ఇందులో హీరోయిన్ గా గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ముఖ్యపాత్రల్లో సదా.. రజత్ బేడీ నటిస్తున్నారు.
సినిమాలో ఇంకా మరికొంత మంది కొత్తవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త వాళ్లతో సినిమా చేసి హిట్ అందుకోవడం అన్నది తేజ ప్రత్యేకత. తాతయ్య..తండ్రి పెద్ద నిర్మాతలైనా బాబాయ్ వెంకేటేష్..అన్నయ్య రానా స్పూర్తితో అభిరామ్ మ్యాకప్ వేసుకున్నాడు. తాతయ్యలా పెద్ద నిర్మాతని చేయాలని సురేష్ బాబు భావించినా అభిరామ్ పట్టు బట్టి హీరో అవుతున్నాడు.
తను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడి తెరంగేట్రం చేస్తున్నాడు. ఇక అభిరామ్ ని యాక్టింగ్ పరంగా తిరిగి చూసుకునే పని ఉండదని రామానాయుడు వర్గాలు బలంగా నొక్కి వొక్కాణిస్తున్నాయి. బేసిక్ గానే అతనిలో చిన్న నాటి నుంచి ఉన్న అల్లరితనం సినిమాలో తన పాత్రకి పక్కా యాప్ట్ అవుతుందంటున్నారు. తనలో ఆ ఎనర్జీని చూసే తేజ తనబాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు పాత్రని డిజైన్ చేసినట్లు చెబుతున్నారు.
ప్రధమార్ధం వరకూ అభిరామ్ తనదైన అల్లరింతనంతో అలరించినా..ద్వితియార్ధంలో అతని పాత్ర మారిపోతుందిట. అక్కడి నుంచి తేజ మార్క్ అప్పీరియన్స్ లో అభిరామ్ కనిపించనున్నాడని సమాచారం. ఈ విషయంలో తేజ ఎక్కడా రాజీ పడలేదుట. బేసిక్ గానే అతను నటుల్ని బయపెట్టి..అవసరమైతే కొట్టి మరీ ఔట్ ఫుట్ తీసుకుంటాడు. అహింస విషయంలోనూ అలాంటివి చోటు చేసుకున్నాయని గుస గుస వినిపిస్తుంది.
అభిరామ్ నటనలో మంచి ఈజ్ ఉందని వినిపిస్తుంది. అలాగే ఈ సినిమాకి ఓ పాత్రకి సదాని...సంగీత దర్శకుడిగా ఆర్ . పీ పట్నాయక్ ని ఎంపిక చేయడం కోస మెరుపుగా చెప్పాలి. తేజ పరిచయం చేసిన హీరో్యిన్లలో సదా ఒకరు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి కొన్నాళ్ల పాటు వెలిగింది. అలాగే తేజ కారణంగానే ఆర్పీ మంచి సంగీత దర్శకుడిగా ఫేమస్ అయ్యారు.
'అహింస'లో ఆ ఇద్దర్నీ తీసుకోవడం వెనుక సక్సెస్ సెంటిమెంట్ ఉదని వినిపిస్తుంది. సినిమాకి ఇద్దరు పిల్లర్ లా నిలుస్తారని సమాచారం. సంగీత పరంగా ఆర్ పీ మ్యాజిక్.. యాక్టింగ్ పరంగా సదా మెరుపులు తేజ నమ్మకాన్ని నిలబెడతాయని టీమ్ కాన్పిడెంట్ గా ఉంది. తేజకిప్పుడు సక్సెస్ అనివార్యం కూడా. ఆయన గత సినిమా 'సీత' ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అంతకు ముందు 'నేనే రాజు నేనే మంత్రి'తో ట్రాక్ లోకి వచ్చినా ఆవెంటనే పరాభవం తేజ వేగానికి అడ్డింకిగా మారింది. ఈ నేపథ్యంలో 'అహింస' సక్సెస్ కీలకంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.