చిరు విలన్ గా హీరోయిన్ భర్త!

Update: 2016-07-28 06:26 GMT
అభిమానులంతా ఆతృతగా - ప్రేక్షకులంతా ఆశగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం చిరంజీవి 150వ సినిమా. ఈ సినిమాకి సంబందించిన వార్తలు మొదలైనప్పటినుండీ ఈ సినిమాపై ఆశలు - అంచనాలూ పెరిగిపోతున్నాయి. అయితే ఈ సినిమాకు సంబందించిన టైటిల్ పైనా హీరోయిన్ పైనా ఇంకా క్లారిటీ రాలేదనేది తెలిసిన విషయమే. ఈ విషయంపై కత్తిలాంటోడు - ఖైదీ నెంబరు 150 - తాజాగా నెపోలియన్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చిరంజీవికి ప్రతినాయకుడు ఎవరనేదానిపై తాజా చర్చ మొదలైంది.

ఈ విషయంపై ప్రస్తుతం చిరు 150వ సినిమా మాతృక "కత్తి"లో విలన్ పాత్ర చేసిన నీలి నితిన్ ముఖేష్ ఆ సినిమాలో మాంచి మార్కులే కొట్టేశాడు. అయితే తెలుగులో కూడా అతడినే ప్రతినాయకుడిగా ఎంపిక చేస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. ఇదే క్రమంలో రకరకాల విలన్స్ పేర్లు తెరపైకి వచ్చినా కానీ.. తాజాగా కొత్తపేరు ఒకటి వినిపిస్తుంది. అది కూడా మరెవరో కాదు...చిరంజీవి సినిమాలోని హీరోయిన్ భర్త.

అవును... చిరంజీవితో "చూడాలని ఉంది" సినిమాలో హీరోయిన్ గా నటించిన అంజలీ జవేరి భర్త తరున్ అరోరాను 150వ సినిమాలో విలన్ గా ఎంపిక చేయనున్నారట. అయితే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా అంజలీ జవేరి చిరంజీవితో చూడాలని ఉంది, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News