చనిపోయిన హీరో సినిమా ప్రపంచ రికార్డ్‌

Update: 2020-07-08 07:10 GMT
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పూత్‌ ఆత్మహత్య జనాల్లో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఇలాంటి సమయంలో ఆయన చివరి సినిమా దిల్‌ బేచారా విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు. సుశాంత్‌ మరణం నుండి తేరుకోని జనాలు ఆ ట్రైలర్‌ను విపరీతంగా చూశారు. అది ఎంతగా అంటే ప్రపంచ రికార్డునే బ్రేక్‌ చేసేంతగా. అవెంజర్స్‌ వంటి హాలీవుడ్‌ సినిమా వ్యూస్‌ను లైక్స్‌ను సైతం ఈ చిత్రం ట్రైలర్‌ బ్రేక్‌ చేసింది.

దిల్‌ బేచారా చిత్రం ట్రైలర్‌ 24 గంటల్లోనే 3.5 కోట్ల వ్యూస్‌ను దక్కించుకోవడంతో పాటు అత్యధిక లైక్స్‌ ను కూడా రాబట్టడం జరిగింది. సుశాంత్‌ చనిపోయిన సింపతీతో పాటు సినిమా ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. సినిమాలో ఆయన చెప్పిన డైలాగ్స్‌ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చాలా ఎమోషనల్‌ డైలాగ్స్‌ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇక ఈ సినిమాను ఈనెల 24 నుండి డిస్నీ హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. సుశాంత్‌ అభిమానుల కోసం ఈ సినిమాను ఉచితంగానే ప్రసారం చేయబోతున్నట్లుగా ఇప్పటికే హాట్‌ స్టార్‌ ప్రకటించింది. దిల్‌ బేచారా చిత్రం ఫ్రీగా ప్రసారం కాబోతున్న నేపథ్యంలో అత్యధికులు చూడబోతున్న చిత్రంగా కూడా సరికొత్త రికార్డును సాధించే అవకాశం ఉందంటూ అంచనా వేస్తున్నారు.
Tags:    

Similar News