సూర్య హీరోగా ఓ సెన్సేషనల్ ప్రాజెక్ట్

Update: 2017-12-13 11:06 GMT
దక్షిణాదిన అతి పెద్ద స్టార్లలో సూర్య ఒకడు. తమిళంలోనే కాక తెలుగులోనూ అతడికి సూపర్ ఫాలోయింగ్ ఉంది. కర్ణాటక.. కేరళల్లోనూ అతడికి అభిమానులు తక్కువగా ఏమీ లేరు. మొత్తంగా సౌత్ ఇండియా అంతటా అతడికి ఫాలోయింగ్ ఉంది. అందుకే సూర్య కొత్తగా ఓ సినిమా కమిటవుతుంటే అందరిలోనూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఈ సంక్రాంతికి ‘తానా సేంద కూట్టం’ (తెలుగులో గ్యాంగ్)తో పలకరించబోతున్నాడు సూర్య. దీని తర్వాత విలక్షణ దర్శకుడు సెల్వ రాఘవన్ తో ఓ సినిమా కమిటయ్యాడు సూర్య. ఈ కాంబినేషన్ ప్రేక్షకుల్లో భలే ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని తర్వాత మరో మెగా ప్రాజెక్టును లైన్లో పెట్టాడు సూర్య.

ఇంతకుముందు సూర్యతో ‘వీడొక్కడే’.. ‘బ్రదర్స్’ లాంటి విభిన్నమైన సినిమాలు తీసిన కె.వి.ఆనంద్ మళ్లీ అతడితో జత కడుతున్నాడు. ‘వీడొక్కడే’తో పాటు ‘రంగం’ సినిమాతో కె.వి.ఆనంద్ దర్శకుడిగా మంచి పేరే సంపాదించాడు. సూర్య-ఆనంద్ కాంబినేషన్లో రాబోయే సినిమాను ‘2.0’ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించబోతుండటం విశేషం. ఇంకొన్ని నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. ఇక సూర్య కొత్త సినిమా ‘గ్యాంగ్’ తెలుగులోనూ కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజయ్యే అవకాశముంది. యువి క్రియేషన్స్ వాళ్లు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న తమిళ.. తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.
Tags:    

Similar News