'సర్కారు వారి పాట' ఆ కుంభకోణం కథేనా..?
గీతగోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాబోతున్న కొత్త సినిమాకు 'సర్కారు వారి పాట' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ సర్కారు వారి పాట సినిమాతో మహేష్ మరోసారి తన బాక్సాఫీస్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నాడు. అసలు పరశురామ్ - మహేష్ బాబుల కాంబినేషన్ కొత్తగా ఉండబోతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ టైటిల్ అయితే కాస్త బజ్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. ఇప్పటికే ఈ సినిమా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ అనౌన్స్ చేయగానే ప్రేక్షకుల నుండి అనూహ్యమైన స్పందన లభించింది. ఆ పోస్టర్ లో మహేష్ లుక్.. టాటూ.. హెయిర్ స్టైల్ మహేష్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ 'సర్కారు వారి పాట' సినిమా కథ ఎలా ఉండబోతుందా అనే సందేహం అందరి లో నెలకొంది. కాగా ఈ సినిమా ఆర్థిక నేరాల బ్యాక్‌డ్రాప్ తో బ్యాంకు చుట్టూ తిరుగుతుందని సమాచారం. దేశం లో జరిగిన కొన్ని భారీ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను స్పృశిస్తూ కథ నడుస్తుందట. ఇందులో హీరో ఓ బ్యాంకు మేనేజర్ గా వందల కోట్లు ఎగ్గొట్టిన ఓ బడా వ్యాపారవేత్త దగ్గర నుండి ఆ కోట్ల డబ్బును ఎలా తిరిగి రాబట్టాడనే ప్రయత్నాలను మనకు చూపించేందుకు పరశురామ్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక సూపర్ స్టార్ సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్.. 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మించనున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. చూడాలి మరి బ్యాంకు మేనేజర్ మహేష్ నిజమేనా.. కాదా.. అనేది అంటున్నారు ఫ్యాన్స్.