సూపర్ స్టార్ క్వారంటైన్ సెల్ఫీ విత్ సితారా పాప...!
సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోలలో కూలెస్ట్ 'సూపర్ స్టార్'గా 'ఫ్యామిలీ మ్యాన్'గా పిలవబడుతుంటాడు మహేష్ బాబు. సినిమా షూటింగ్ పనులలో తాను ఎంత బిజీగా ఉన్నా.. వారాంతంలో మాత్రం తప్పకుండా తన కుటుంబంతోనే ఆయన గడుపుతారు. మొదటి నుంచి కూడా ఫ్యామిలీకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా తన పిల్లలతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తారు. వారిని టూర్లకు ఔటింగ్స్ కి తీసుకెళ్తూ వారికి ఫ్యామిలీ లైఫ్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. అందుకే ఆయన ఆన్ స్క్రీన్ లోను.. ఆఫ్ స్క్రీన్ లోనూ సూపర్ స్టారే అంటుంటారు ఆయన అభిమానులు.
కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల షూటింగులు లేక సెలబ్రెటీలు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే హీరోలు ఇప్పుడు ఖాళీ అయిపోయారు. తమకు దొరికిన ఈ అవకాశంతో కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీతో మిస్ అయిన సమయాన్ని అంతా ఇప్పుడు కవర్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ అంటే ప్రాణమిచ్చే సూపర్ స్టార్ మహేష్ అయితే కరోనా నేపథ్యంలో వచ్చిన అనుకోని సెలవులను అదిరిపోయేలా వాడుకుంటున్నాడు. ముందే ఈ లాక్ డౌన్ సమయంలో ఏమి చేయాలని టైం టేబుల్ వేసుకున్నాడు మహేష్. సతీమణి నమ్రత.. పిల్లలు సితార - గౌతమ్ కృష్ణ లతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకడంతో మహేష్ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తను క్వారంటైన్ టైమ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను వీడియోలను అభిమానులకు షేర్ చేసి వారిని ఖుషీ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా తన కూతురు సితారతో కలిసి దిగిన ఫోటో పోస్ట్ చేసాడు సూపర్ స్టార్. పిల్లలతో ఆడుకోవడమే మహేష్ బాబుకు సరిపోతుందని ఈ సెల్ఫీ ఫోటోతో అర్థం అవుతుంది. సెల్ఫీ ఫోటో మాములుగా దిగితే కిక్కేముంది అనుకొని.. ట్రెండ్ కి తగ్గట్టు అందరూ ఇచ్చే సెల్ఫీ ఫోజ్ ఇచ్చేసారు ఇద్దరు. మహేష్ - సితార ఇద్దరూ ఒక కన్ను మూసి.. మూతి వంకరగా పెట్టి సెల్ఫీ క్లిక్ చేశారు. ఈ ఫొటోలో మహేష్ గ్లాసెస్ ధరించి కుర్రాడిలా మారిపోయాడు. ఈ లుక్ లో చూస్తే మహేష్ ఏజ్ ఎంత అని గూగుల్ చేస్తారంటే నమ్మండి. ఇంకేముంది ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మొత్తం మీద మన సూపర్ స్టార్ మహేష్ కూడా తన ఫ్యామిలీతో క్వారంటైన్ టైమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పవచ్చు.