షారుఖ్ ‘జవాన్ 2’లో ట్విస్ట్.. సౌత్ హీరో విలన్‌గా?
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'కింగ్' ముగియకముందే 'జవాన్ 2' కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.;
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన తదుపరి భారీ ప్రాజెక్ట్ 'కింగ్' ముగియకముందే 'జవాన్ 2' కోసం రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన 'జవాన్'కు సీక్వెల్ రాబోతుండటంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ఈ రెండో భాగంలో షారుఖ్‌ను ఢీకొట్టే విలన్ పాత్ర కోసం దర్శకుడు అట్లీ ఒక టాలీవుడ్ లేదా కోలీవుడ్ టాప్ స్టార్‌ను రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు ఇలా వున్నాయి..
బాక్సాఫీస్ రికార్డుల వేటలో ‘జవాన్ 2’:
అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'జవాన్' పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందనే వార్త ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని, షారుఖ్ తన ప్రస్తుత కమిట్‌మెంట్స్ పూర్తి చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక మొదటి భాగం విజయం అందించిన ఉత్సాహంతో, రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో, గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పించేలా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారు.
విలన్ పాత్రలో సౌత్ సూపర్ స్టార్?:
'జవాన్' మొదటి భాగంలో విజయ్ సేతుపతి తన నటనతో విలన్ పాత్రకు ప్రాణం పోశారు. ఇప్పుడు సీక్వెల్ కోసం అట్లీ అంతకంటే పవర్‌ఫుల్ విలన్‌ను వెతికే పనిలో ఉన్నారు. టాలీవుడ్ లేదా కోలీవుడ్‌కు చెందిన ఒక టాప్ హీరోని ప్రతి నాయకుడిగా చూపించాలని అట్లీ ప్లాన్ చేస్తున్నారట. షారుఖ్ లాంటి పెద్ద స్టార్ ను సౌత్ ఇండియాకు చెందిన ఒక టాప్ హీరో ఢీకొంటే ఆ క్రేజ్ వేరే లెవల్‌లో ఉంటుంది. మరి ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో, ఆ విలన్ టాలీవుడ్ నుంచా లేక కోలీవుడ్ నుంచా అన్నది సస్పెన్స్‌గా మారింది.
అట్లీ మార్క్ మ్యాజిక్.. త్వరలో సెట్ పైకి..
షారుఖ్, అట్లీ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండగ. అందుకే 'జవాన్ 2' వెంటనే పట్టాలెక్కేలా డైరెక్టర్ అట్లీ ప్లాన్ చేస్తున్నారు.. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తి చేయగా.. షారుక్ ఖాన్ ఆ స్క్రిప్ట్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీ - అల్లు అర్జున్ తో రాకా సినిమా చేస్తున్నారు. అలాగే షారుక్ ఖాన్ కింగ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అన్నీ పూర్తయ్యాక ఈ సినిమా పెట్టాలెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.
ఒకవేళ సౌత్ సూపర్ స్టార్ ఎవరైనా విలన్‌గా నటిస్తే, ఈ సినిమా కలెక్షన్ల పరంగా మరో చరిత్ర సృష్టించడం ఖాయం. ప్రస్తుతం ఇవన్నీ చర్చల దశలోనే ఉన్నప్పటికీ, షారుఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే అంచనాలు సహజమే. అట్లీ ఈసారి ఎలాంటి మాస్ ట్విస్ట్‌లు ప్లాన్ చేస్తున్నారో, ఆ సౌత్ హీరో ఎవరో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.